CORONA IN INDIA CM YOGI ORDERS SEVEN DAYS PAID LEAVE FOR CORONA POSITIVE EMPLOYEE EVK
Corona Cases In India: కరోనా వచ్చిందా.. ఏడు రోజుల పెయిడ్ లీవ్ ఇవ్వాలి.. ముఖ్యమంత్రి ఆదేశం
(ప్రతీకాత్మక చిత్రం)
Corona Cases In India | దేశ వ్యాప్తంగా కరోనా కేసులు (Corona Cases) భారీగా పెరుగుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రం త్వరలో ఎన్నికలో జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో 8,334 మందికికొవిడ్ పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో యోగీ సర్కార్ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు (Corona Cases) భారీగా పెరుగుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రం త్వరలో ఎన్నికలో జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో 8,334 మందికికొవిడ్ పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం యూపీలో 33,946 క్రియశీల కేసులుం డగా..33,563 మంది హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే ఎన్నికల సమయానికి కేసులు భారీగా పెరుగుతాయి. ఫిబ్రవరి 10, 2022 నుంచి మార్చి 7, 2022 వరకు ఏడు విడతల్లో ఉత్తర్ ప్రదేశ్‌లో పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి యోగీ ఆదిత్య నాథ్ (Yogi Adityanath) సర్కారు పలు చర్యలకు ఉపక్రమించింది.
ఉత్తర్ ప్రదేశ్‌లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి యోగీ ఆదిత్యానాథ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. రాష్ట్రంలో పలు ప్రైవేటు కార్యాలయాల్లో వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు. ప్రతీ చోటా స్క్రీనింగ్ (Screening) లేకుండా అనుమతించకూడదని తెలిపారు. ప్రైవేటు సంస్థల్లో కరోనా వస్తే 7 రోజులు వేతనంతో కూడిన సెలువు ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రతి ఒక్క రికీ 10 రోజుల ముం దుగానే టీకాలు వేయించాలని.. ఇందుకోసం తక్షణమే ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ (Omicron) వేరియంట్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటు భారత్‌లోనూ డెల్టా వేరియంట్ (Delta Variant) స్థానంలో ఒమిక్రాన్ భర్తీ చేసిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే ఆందోళన కలిగించే అంశం ఇండియాలో ఒమిక్రాన్ మరో రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో కొత్త వేరియంట్ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానిపేరు ఒమిక్రాన్ బీఏ.1 (Omicron BA.1) జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన భారతీయ వైరాలజిస్టులు BA.1 ఓమిక్రాన్ కంటే వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కొన్ని ఇతర రాష్ట్రాల్లో, డెల్టా వేరియంట్ స్థానంలో ఒమిక్రాన్ వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఇండియాలో వచ్చిన సెకండ్ వేవ్ (Second wave) కు డెల్టా వేరియంట్ కారణం. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ డెల్టా వేరియంట్కంటే ఐదు రెట్టువేగంగా వ్యాపిస్తోంది.
డెల్టా వేరియంట్ 100 రోజులకు ఒమిక్రాన్ 15 రోజులకు సమానంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం వైరాలజిస్టులు చెబుతున్న దాని ప్రకారం ఒమిక్రాన్ బీఏ.1 చాలా బలంగా వ్యాపిస్తుందిని అంటున్నారు. ఇది భారత్‌లో వేగంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (INSACOG) , వైరాలజిస్ట్ల ప్రకారం, ఒమిక్రాన్ BA.1 దాని వేగవంతమైన వృద్ధి ధోరణి కారణంగా చాలా వేగంగా వ్యాపిస్తుంది. అయితే కరోనా వ్యాప్తిలో వ్యాధి లక్షణాలు తేలికగా ఉన్నా వేగంగా వ్యాపిస్తున్నాయి. వేగంగా ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. దీని ద్వారా లక్షణాలు తేలికగా ఉన్నా ఎక్కువ మందికి వ్యాపించడం ద్వారా వైద్య సేవల అవసరం ఎంతో పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.