Immunity: ఇమ్యూనిటీ లేని వారికి వ్యాక్సిన్ పనిచేయదా?... మీ సందేహాలకు సమాధానాలివే

బ్యాంకు సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్... వారం పాటు స్పెషట్ డ్రైవ్...!

Immunity: దేశంలో మూడు వ్యాక్సిన్లు వచ్చినా... ప్రజల్లో రకరకాల అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ఎక్కువ మంది అడిగే సందేహాలకు న్యూస్18... నిపుణుల ద్వారా సమాధానాలు రాబట్టింది. అవి తెలుసుకుందాం.

  • Share this:


Immunity Power: కరోనా కట్టడికి ఏకైక మార్గంగా భావిస్తున్న వ్యాక్సిన్లపై చాలా మందిలో అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధక శక్తి) తక్కువగా ఉన్న వ్యక్తుల్లో టీకా సమర్థవంతంగా పనిచేస్తుందా? లేదా? ఇమ్యూనిటీ లేని వారు ఏవైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా? అసలు ఇమ్యూనిటీ ఎంత ఉందో ఎలా తెలుస్తుంది? ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాటికి సరైన ఆన్సర్లు తెలుసుకుందాం. అలాగే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా వద్దా అనే విషయలను తెలిసుకుందాం. ఇవి తెలుసుకోవడం ద్వారా... కరోనా వ్యాక్సిన్‌కి సంబందించి చాలా డౌట్లు క్లారిఫై అవుతాయి.

1. ఇమ్యూనిటీ అంటే ఏమిటి?
వయసు పెరిగే కొద్ది అనేక వ్యాధులు మనపై దాటి చేస్తుంటాయి. వాటి నుంచి మనల్ని కాపాడేదే ఇమ్యూనిటీ. విపులంగా చెప్పాలంటే ఇమ్యూనిటీ అనేది మన శరీరానికి రక్షణ వలయంగా పనిచేస్తుంది. అంటువ్యాధులు సోకకుండా మనల్ని కాపాడుతుంది. ప్రతి మనిషి శరీరంలో రెండు రకాలుగా ఇమ్యూనిటీ పెంపొందుతుంది. ఒకటి పుట్టినప్పుడు మన శరీరంలో సహజంగానే ఇమ్యూనిటీ ఉంటుంది. ఇక రెండోది, పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ఇలా కొన్ని పద్ధతుల ద్వారా ఇమ్యూనిటీ పెంచుకుంటాం.

2. ఇమ్యూనిటీ లేనివారు ఎవరు?
యాంటిజెన్‌ లేదా సూక్ష్మక్రిములతో సమర్థవంతంగా పోరాడలేకపోయే వ్యక్తులను ఇమ్యూనిటీ లేని వారిగా చెబుతారు. పోషకాహార లోపంతో బాధపడేవారు లేదా HIV ఎయిడ్స్, మైకోబాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే క్షయ, మధుమేహం, COPD, కాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు ఉన్నవారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. కాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా అవయవ మార్పిడి తర్వాత ఇమ్యూనిటీ చాలా వరకు తగ్గుతుంది. దీంతో పాటు వయసు పెరిగే కొద్దీ కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. అందుకే ముసలివారు అంటు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ.

3. ఇమ్యూనిటీ లేని వారికి అంటువ్యాధులు సోకే అవకాశం ఎక్కువేనా?
అవును. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే.. సూక్ష్మక్రిములు లేదా యాంటిజెన్‌లతో పోరాడే శక్తి తగ్గుతుంది. తద్వారా కరోనా వంటి ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

4. ఇమ్యూనిటీ లేని వారికి టీకా అవసరమా?
అవును, ఎందుకంటే ఇమ్యూనిటీ లేని వ్యక్తులకు కరోనా సోకే అవకాశం ఎక్కువ. కాబట్టి, వారికి కచ్చితంగా టీకా అవసరం.

5. ఇమ్యూనిటీ లేని వారిపై టీకా సమర్థవంతంగా పనిచేస్తుందా?
వ్యాక్సిన్ మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచుతుంది. అంతేకానీ, వైరస్‌ని చంపలేదు. అయితే, వ్యాక్సిన్​ ద్వారా మన శరీరంలో నేచురల్​యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి, వ్యాధులను తట్టుకునే శక్తి వస్తుంది. తద్వారా, కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ కరోనా సోకినా సరే మరణించే అవకాశాలు చాలా తక్కువ.

6. టీకా తర్వాత ఇమ్యూనిటీ పెరిగిందని ఎలా గుర్తించాలి?
టీకా ద్వారా శరీరంలో సహజంగానే యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. దీన్ని గుర్తించడానికి ల్యాబరేటరీ టెస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

7. యాంటీ బాడీల సంఖ్య తెలుసుకోవచ్చా?
యాంటీ బాడీల సంఖ్యను గుర్తించేందుకు అనేక ల్యాబరేటరీ టెస్ట్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, కరోనా నుంచి కాపాడేందుకు అవసరమైన యాంటీబాడీల సంఖ్యను గుర్తించలేం.

8. రక్తంలో యాంటీబాడీలు లేని వ్యక్తులకు కరోనా సోకే అవకాశం ఉందా?
రక్తంలో యాంటీబాడీలు లేకపోవడం అనేది సంక్రమణకు దారి తెరిచినట్లే అవుతుంది. అందువల్ల, టీకా ద్వారా యాంటీబాడీలను పెంచుకోవాలి. అయితే, యాంటీబాడీలు తగిన మొత్తంలో ఉన్నప్పటికీ కరోనా సోకే అవకాశం లేకపోలేదు. యాంటీబాడీలు ఉన్నంత మాత్రాన కరోనా సోకదని కచ్చితంగా చెప్పలేం.

9. అలాంటప్పుడు, మరి టీకాల వల్ల ఉపయోగం ఏమిటి?
టీకాలు వేయడం వల్ల ఎక్కువ శాతం వ్యక్తులను వ్యాధి బారి నుండి కాపాడుకోవచ్చు. ఒకవేళ వ్యాధి సోకినప్పటికీ దాని తీవ్రతను తగ్గించవచ్చు. టీకాలు వేసుకుంటే కరోనాతో మరణించే అవకాశాలు చాలా తక్కువ.

ఇది కూడా చదవండి: Viral: ఎలుకకు రిటైర్మెంట్... అపూర్వ సేవలకు గుర్తుగా గోల్డ్ మెడల్

10. ఇమ్యూనిటీ ఉన్నవారా? లేనివారా? ఎవరు వ్యాక్సిన్​ వేసుకోవాలి?
వ్యక్తుల రోగనిరోధక స్థితితో సంబంధం లేకుండా టీకాలు వేసుకోవాలి. దీని ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధి సోకే అవకాశాలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు టీకాల్లో ప్రాధాన్యం ఇస్తే మరణించే అవకాశాలను తగ్గించవచ్చు. టీకా వేసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయా? లేదా? అనే విషయంపై సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్​ వేసుకోవడం సురక్షితం.

Published by:Krishna Kumar N
First published: