Corona Devi: అమ్మా కరోనా తల్లీ రక్షించు.. తమిళనాడులో విగ్రహం ఏర్పాటు.. ప్రత్యేక పూజలు

కరోనా దేవి విగ్రహానికి పూజలు

కరోనా అంతం కావాలంటూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు కొనసాగుతున్నాయి.

  • Share this:
    కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందా అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. మన దేశంలో దాదాపుగా అంతరించిపోయిందని భావించిన ఈ వైరస్.. సెకండ్ వేవ్ రూపంలో విలయం సృష్టిస్తోంది. లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం చూస్తున్న ప్రజలు.. అసలు ఈ కరోనాకు అంతం ఉంటుందా ? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కరోనా అంతం కావాలంటూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఆలయంలో కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కామచిపురి ఆధీనంలోని ఆలయంలో కరోనా దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

    అంతేకాదు ఆలయ అధికారులు 48 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలో భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించబోమని తెలిపారు. అంతేకాదు ఈ సమయంలో మహాయజ్ఞం కూడా చేపడతామని అన్నారు. అయితే తమిళనాడులో ఈరకంగా విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేయడం ఇక్కడ కొత్తేమీ కాదు. గతంలో ప్లేగు వ్యాధి విజృంభించిన సమయంలోనూ మరియమ్మన్ దేవాలయంలో ఇలాగే విగ్రహం ఏర్పాటు చేసి పూజాలు చేశారు. ఇప్పుడు కూడా అదే రకంగా కరోనా దేవి విగ్రహం ఏర్పాటు చేసి పూజాలు చేయాలని నిర్ణయించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: