Corona dead bodies : నదుల్లో తేలుతున్న శవాలు..100కు పైగా నదీ ఒడ్డున మృతదేహాలు

Corona dead bodies : నదుల్లో తేలుతున్న శవాలు..100కు పైగా నదీ ఒడ్డున మృతదేహాలు

నదుల్లో తేలుతున్న శవాలు..100కు పైగా నదీ ఒడ్డున మృతదేహాలు

Corona dead bodies : ఉత్తరాదిన కరోనా శవాలు కలకలం రేపుతున్నాయి. గంగా ,యమునా నదుల్లో వందల కొద్ది శవాలు నీటిలో తేలియాడుతున్నాయి. కొన్ని శవాలు ఒడ్డుకు కొట్టుకు రావడంతో కుక్కలు సైతం వాటిని పీక్కుతింటున్నాయి.

  • Share this:
నదుల్లో లో శవాలు తేలియాడుతున్నాయి. శవాలు ఎక్కడనుండి వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇలా బీహార్‌లోని గంగానది, యూపీలోని యమునా నదుల్లో సుమారు కిలోమీటరు మేర శవాలు గంగలో తేలియాడుతున్నాయి. ఇలా గంగలో తేలియాడుతున్న మొత్తం 100 శవాలను పోలీసులు గుర్తించారు.

కరోనాతో పలు రాష్ట్రాల్లో భయానక వాతవరణాన్ని సృష్టిస్తోంది. ఎక్కడ చూసిన ఆర్తనాదాలు, చనిపోయిన శవాలు, ఇలా కరోనా తో చనిపోతే కనీసం దగ్గరకు రాని పరిస్థితి నెలకొంది. ఇక అనాధాలు , దీనావస్థలో ఉన్న వారి పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కరోనాతో చనిపోయిన శవాలను కనీసం కాల్చాడినికి కూడ అవకాశం లేకుండా పోతుంది.ఈనేపథ్యంలోనే యూపీ ,బీహార్‌ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో శవాలను కాల్చకుండానే నదిలో విసిరి వేస్తున్నారు.

ముఖ్యంగా బీహార్‌లోని బక్సర్ జిల్లాల్లో కిలోమీటరు మేర సుమారు 100పైగా శవాలు ఒడ్డుపైకి తేలియాడుతు ఉన్న శవాలను బీహార్ పోలీసులు గుర్తించారు. ఇందులో కొన్ని మృత దేహాలు ఒడ్డకు కొట్టుకురావడంతో కుక్కలు సైతం పీక్కుతింటున్నాయి. దీంతో స్థానికుల్లో మరింత ఆందోళన చెలరేగుతోంది. వీటివల్ల కరోనా మరింత విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక యూపీలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది.యూపీలోని హమీపూర్ ‌జిల్లాలో పారుతున్న యమునా నదిలో కూడ శవాలు తేలుతున్నాయి. ముఖ్యంగా హమిపూర్ ,కాన్పూర్ జిల్లాల్లో కరోనా మృతులు పెరుగుతుండడంతో శ్మశానాలు కిటకిటలాడుతున్నాయి. దీంతో కొంతమంది శవాలను నదిలో వదిలో వేస్తున్నారు. మరోవైపు గుర్తు తెలియని శవాలను కూడ అధికారులు నదిలో పారవేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

అయితే హమీపూర్ జిల్లా ఎస్పీ అనుప్‌కుమర్ మాత్రం మరో విధంగా స్పందించారు. ఆయా జిల్లాలోని పలు తెగలు చనిపోయిన తర్వాత శవాలను కాల్చడం కాని, పూడ్చడం చేయరని చెప్పారు. దీంతో నదుల్లో శవాలు తేలియాడుతున్నాయని చెప్పారు. మరోవైపు కరోనాతో చనిపోయిన వారిని ఖననం చేయకుండా నదుల్లో పారవేస్తున్నారని వివరించారు.
Published by:yveerash yveerash
First published: