Home /News /national /

CORONA CASES THERE IS A 51 PERCENT INCREASE IN CORONA CASES IN A SINGLE DAY IN DELHI EVK

Corona Cases:అక్క‌డ ఒక్క రోజులో 51శాతం పెరిగిన క‌రోనా కేసులు.. అల‌ర్ట్‌!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Omicron in India | దేశంలో క‌రోనా (Corona) కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కార‌ణంగా మ‌ళ్లీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలోకి వెళ్లిపోతుంది. ఢిల్లీ (Delhi) ఒక్క‌ శనివారం 2,716 కొత్తగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

ఇంకా చదవండి ...
    దేశంలో క‌రోనా (Corona) కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కార‌ణంగా మ‌ళ్లీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలోకి వెళ్లిపోతుంది. ఢిల్లీ (Delhi) ఒక్క‌ శనివారం 2,716 కొత్తగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల తీవ్ర‌త శుక్రవారం కంటే 51% ఎక్కువ. దీంతో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 3.64శాతానికి చేరుకుంది. అంతే కాకుండా క‌రోనాతో ఒక‌రు మృతి చెందారు. డిసెంబ‌ర్ 31, 2021న 2.44 శాతం పాజిటివ్ రేటుతో 1,796 క‌రోనా కేసులు నమోదయ్యాయి. దీంతో క‌రోనా మ‌హ‌మ్మారి కేసుల సంఖ్య ఢిల్లీలో 14,50,927 కు పెరిగింది. మ‌ర‌ణాల సంఖ్య 25,108కి చేరుకుంది.

    351 ఒమిక్రాన్ కేసులు..
    శ‌నివారం ఒక్క రోజే ఢిల్లీలో ఓమిక్రాన్ (Omicron) సంఖ్య 351కి పెరిగింది. 31 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధికంగా ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అంతకుముందు నూతన సంవత్సరం సందర్భంగా, ముఖ్యమంత్రి అర వింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలోని ప్రజలను ఇంట్లోనే ఉండాలని, కేసుల‌ సంఖ్య పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని COVID- తగిన ప్రవర్తనను అనుసరించాలని కోరారు.

    కేసుల పెరుగుదల ఎక్కువగా ఉండ‌డం.. కేసుల కూడా ఒమిక్రాన్ వ్యాప్తికి దోహ‌దం చేయ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని వైద్యులు అంటు్నారు. ఒమిక్రాన్ రోగ నిరోధ‌క శ‌క్తిని త‌ట్టుకొని నిల‌బ‌డ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశంగా వైద్యులు అభిప్రాయ ప‌డుతున్నారు. గ్రేడెడ్ యాక్షన్ రెస్పాన్స్ ప్లాన్ (Graded Action Response Plan) ప్రకారం దేశ రాజధానిలో 'ఎల్లో అలర్ట్' వినిపించినప్పటికీ కేసుల పెరుగుదల పెరిగింది.

    Cryptocurrency: క్రిప్టోకరెన్సీ సర్వీస్ ప్రొవైడర్ ఆఫీస్‌ల‌పై డీజీజీఐ దాడులు.. భారీగా ప‌న్ను ఎగొట్టినట్టు గుర్తింపు!


    దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ (Pm Modi) వాజ్‌పేయి జ‌యంతి సంద‌ర్భంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌లు ఇవ్వ‌డంతోపాటు ఫ్రంట్‌లైన్ కార్మికుల‌కు, 60 ఏళ్ల పైబ‌డిన వృద్ధుల‌కు బూస్ట‌ర్ డోస్ (మూడో డోస్‌) ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ బూస్ట‌ర్ డోస్ జ‌న‌వ‌రి 10 , 2021 నుంచి అందిస్తున్న‌ట్టు తెలిపారు.

    ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువ‌గా గుర్తించిన ల‌క్ష‌ణాలు
    - ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్ర‌త్యేకంగా లేవు.
    - డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొంద‌రిలో ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌డం లేదు.

    CoWIN Registration for Children: పిల్ల‌ల‌కు కోవిడ్‌ వ్యాక్సిన్.. ఎప్ప‌టి నుంచి రిజిస్ట‌ర్ చేసుకోవాలి.. ఎలా చేసుకోవాలి!


    - వేరియంట్ సోకిన‌వారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
    - గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్న‌ట్టు వైద్యులు గుర్తించారు.
    - ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువ‌గా ఉంటాయి.
    - వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువ‌గా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Corona, Delhi, Omicron, Omicron corona variant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు