CORONA CASES IN INDIA RISING COVID 19 IN MUMBAI POSITIVITY RATE 23 PERCENT EVK
Corona Cases: ముంబాయిలో పెరుగుతున్న కేసులు.. పాజిటివిటీ రేటు 23శాతం!
ప్రతీకాత్మక చిత్రం (istock)
Corona Cases | దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో ముంబాయిలో 13,648 కొత్త కోవిడ్ -19 కేసులు వచ్చాయి. 5 మరణాలు సంభవించినట్టు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు (Corona Cases) భారీగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో ముంబాయిలో 13,648 కొత్త కోవిడ్ -19 కేసులు వచ్చాయి. 5 మరణాలు సంభవించినట్టు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఒక్క రోజు 59,242 నమూనాలను పరీక్షించగా, పాజిటివిటీ రేటు 23 శాతంగా నమోదైంది. కొత్త కేసులు మునుపటి రోజు కంటే 5,826 తక్కువగా ఉన్నాయి మరియు పాజిటివిటీ రేటు 28 శాతం నుండి 23 శాతానికి 5 శాతం తగ్గింది. అంతే కాకుండా ముంబాయిలో 27,214 డిశ్చార్జ్‌లను నమోదయ్యాయి. మొత్తం రికవరీల సంఖ్య 8,05,333కి చేరుకుంది. ముంబైలో 1,03,862 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. ముంబై (Mumbai)లో కోవిడ్-19 కేసులు తగ్గడం ఇది వరుసగా మూడో రోజు. అయితే, అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రదీప్ వ్యాస్ మాట్లాడుతూ, TPR ఇంకా ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ముంబాయి (Mumbai) లో కోవిడ్ -19 ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పట్ల జనం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని బొంబాయి హైకోర్టు తెలిపింది. వ్యాక్సినేషన్, బెడ్ మేనేజ్‌మెంట్, అంబులెన్స్ నిర్వహణ మరియు ఆక్సిజన్ సరఫరాపై చర్యలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ మకరంద్ ఎస్ కార్నిక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పౌర సంస్థను ఆదేశించింది.
మహారాష్ట్రలో కోవిడ్-19 చికిత్సను సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపిస్తూ నగరానికి చెందిన న్యాయవాది స్నేహ మర్జాడి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్) కోర్టు విచారించింది. దీనిపై కోర్టు విచారించి ఈ వ్యాఖ్యలు చేసింది.
ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువగా గుర్తించిన లక్షణాలు
- ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.