Home /News /national /

CORONA CASES COVID POSITIVE FOR BJP PRESIDENT JAGAT PRAKASH NADDA CORONA EFFECT FOR LEADERS EVK

Corona Cases: జేపీ నడ్డాకు కొవిడ్ పాజిటివ్.. బ‌డానేత‌ల‌కు కోవిడ్ ఎఫెక్ట్‌!

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా (Image; BJP

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా (Image; BJP

Jagat Prakash Nadda | బీజేపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా క‌రోనా బారిన ప‌డుతున్నారు. భాజపా జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు కనబడటంతో ఆయ‌న పరీక్ష చేయించుకున్నారు. ప‌రీక్ష‌లో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఆయన ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్లడించారు. తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...

    బీజేపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా క‌రోనా (Corona) బారిన ప‌డుతున్నారు. భాజపా జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా (JP Nadda) కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు కనబడటంతో ఆయ‌న పరీక్ష చేయించుకున్నారు. ప‌రీక్ష‌లో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఆయన ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్లడించారు. తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం వైద్యుల సూచ‌న మేర‌కు స్వీయ నిర్బంధంలో ఉన్న‌ట్టు ట్విట్ట‌ర్‌లో తెలిపారు. త‌న‌కు క‌రోనా రావ‌డంతో ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన‌వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలని కోరారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. పార్లమెంట్ సిబ్బంది నుంచి పోలీసుల దాకా వేల సంఖ్యలో సిబ్బంది కరోనా కాటుకు గురవుతున్నారు. కొత్త కేసులు వెల్లువలా వస్తుండటంతో ఢిల్లీ దాదాపు లాక్ డౌన్ దిశగా పయనిస్తోంది. ఈలోపే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సైతం కరోనా సోకిందనే వార్త కలవరపెడుతోంది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తాజాగా కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు  ఆయన స్వయంగా ప్రకటించారు.


    Corona Cases: ముంబాయిలో పెరుగుతున్న‌ కేసులు.. పాజిటివిటీ రేటు 23శాతం!






    దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు (Corona Cases) భారీగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబాయిలో క‌రోనా ఉధృతి ఎక్కువ‌గా ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ముంబాయిలో 13,648 కొత్త కోవిడ్ -19 కేసులు వ‌చ్చాయి. 5 మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్టు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఒక్క రోజు 59,242 నమూనాలను పరీక్షించగా, పాజిటివిటీ రేటు 23 శాతంగా నమోదైంది. కొత్త కేసులు మునుపటి రోజు కంటే 5,826 తక్కువగా ఉన్నాయి మరియు పాజిటివిటీ రేటు 28 శాతం నుండి 23 శాతానికి 5 శాతం తగ్గింది. అంతే కాకుండా ముంబాయిలో 27,214 డిశ్చార్జ్‌లను నమోద‌య్యాయి.

    PM Modi: ఆల‌య సిబ్బందికి 100 జతల జ్యూట్ పాదరక్షలు పంపిన ప్ర‌ధాని మోదీ

    ఇటీవ‌ల‌ ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న బీజేపీ నాయ‌కుడు వ‌రుణ్ గాంధీకి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా బూస్ట‌ర్ డోస్ అందించేలా చూడాల‌ని ఎలెక్ష‌న్ క‌మిష‌న్‌ను కోరారు. "3 రోజులు పిలిభిత్‌లో ఉన్న తర్వాత, నాకు చాలా బలమైన లక్షణాలతో కోవిడ్‌కు పాజిటివ్ వ‌చ్చింది" అని వ‌రుణ్‌గాంధీ ట్వీట్ చేశారు. కరోనావైరస్ మహమ్మారి ఉధృతి ఉన్న మూడో వేవ్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Bjp, Corona cases, India, JP Nadda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు