CORONA CASES CORONA FOR 150 SUPREME COURT STAFF AND 20000 CASES IN A SINGLE DAY IN DELHI EVK
Supreme Court: 150 మంది సుప్రీం కోర్టు సిబ్బందికి కరోనా.. ఢిల్లీలో ఒక్క రోజే 20,000 కేసులు
ప్రతీకాత్మక చిత్రం
Corona Cases in India | దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య భారీగా పెరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే కేసులు సంఖ్య భారీగా పెరిగి. రోజు వారీ కేసులు సంఖ్య 20,000పైన వస్తున్నాయి. తాజాగా ఈ కోవిడ్ దెబ్బ సుప్రీం కోర్టుకు తాకింది.
దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు (Corona Cases) సంఖ్య భారీగా పెరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే కేసులు సంఖ్య భారీగా పెరిగి. రోజు వారీ కేసులు సంఖ్య 20,000పైన వస్తున్నాయి. తాజాగా ఈ కోవిడ్ దెబ్బ సుప్రీం కోర్టుకు తాకింది. 150మంది సుప్రీం కోర్టు సిబ్బందికి కరోనా పాజిటీవ్ వచ్చినట్టు ప్రకటించింది. ఇప్పటికే పార్లమెంట్లో ఇప్పటికే 400మంది కోవిడ్ బారిన పడ్డారు. సుప్రీం కోర్టు సిబ్బందిలో 5శాతం వైరస్ బారిన పడ్డారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో సుప్రీం కోర్టు (Supreme Court) ప్రాంగణంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. 3,000 మందికి పైగా సుప్రీం కోర్టు సిబ్బంది ఉన్నారు. తాజాగా కరోనా పరీక్షలో 150 మందికి పాజిటివ్ వచ్చినట్టు సుప్రీం కోర్టు అధికార వర్గాలు తెలిపాయి.
దేశంలో కరోనా కేసులు (Corona Cases) రోజురోజుకు పెరగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లీ (Delhi) లో పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. కరోనా కేసుల కారణంగా ఏయిమ్స్ వైద్య సిబ్బంది సెలవులు రద్దు చేశారు.
ప్రస్తుతం దేశంలో కరోనా పెరుగుదల రేటు ఆధారంగా పలు విశ్లేషణలు చేసిన ఐఐటీ మద్రాస్.. ఫిబ్రవరి 1-15 మధ్య మూడవ వేవ్ యొక్క గరిష్ట స్థాయిని తాకుతుందని తెలిపింది. ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉంటుందని సర్వేలో వివరించారు. అయితే వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు ఈ రేటును ప్రభావితం చేయగలవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఒమిక్రాన్ (Omicron) కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆర్-నాట్ విలువ 1.69 ఉందని తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో ఒకే రోజు 1,41,986 కొత్త కరోనావైరస్ (Corona Virus) కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు కోవిడ్ కేసుల సంఖ్య 3,53,68,372కి చేరుకుంది. ఇందులో 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇప్పటివరకు నమోదైన 3,071 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రం పంజాబ్ (Punjab) లో కోవిడ్ కేసులు బాగా పెరగడమే కాకుండా.. గడిచిన 24 గంటల్లో ఆక్సిజన్ తీసుకునే రోగుల సంఖ్య పెరగడం ఆందోళనకు కారణం. శనివారం విడుదల చేసిన రాష్ట్ర మెడికల్ బులెటిన్ ప్రకారం, శుక్రవారం కేవలం 62 మంది రోగులకు ఆక్సిజన్ సపోర్ట్ (Oxygen Support) లో 226 మంది ఉన్నారు. ఇది కేవలం 24 గంటల్లో 264% పెరిగింది. జనవరి 1న కేవలం 23 మంది రోగులు మాత్రమే ఆక్సిజన్ సపోర్ట్‌లో ఉన్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.