• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • COP THRASHED BY VILLAGERS IN MADHYA PRADESH VIDEO GOES VIRAL SU

Lockdown: పోలీసు అధికారిపై విచక్షణ రహితంగా దాడి చేసిన గ్రామస్తులు.. షాకింగ్ వీడియో

(Image-ANI)

పోలీసు అధికారిపై ఓ గ్రామ ప్రజలు విచక్షణ రహితంగా దాడి చేశారు. కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  • Share this:
    పోలీసు అధికారిపై ఓ గ్రామ ప్రజలు విచక్షణ రహితంగా దాడి చేశారు. డ్యూటీలో ఉన్న అతడిని కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో పోలీసు అధికారి తలకు గాయమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 330 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఛత్తర్పూర్‌‌లోని జామ్‌తులి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. కర్ఫ్యూ సమయంలో దుకాణాలు మూసివేయాలని చెప్పడంతో.. స్థానికులు ఈ రకమైన దాడికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. ఇక, ఆ వీడియోలో కొందరు ఆవేశంతో పోలీసు అధికారిపై దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అలాగే దాడికి పాల్పడిన వారు అసభ్య పదజాలంతో పోలీసును దూషించడం కూడా వీడియోలో రికార్డు అయింది. పోలీసుపై దాడి చేసిన వారిలో చాలా మంది మాస్క్ ధరించలేదు. కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేసే క్రమంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.

    పోలీస్‌ ఓ వ్యక్తి తలపై పోలీస్‌ గట్టిగా కొట్టాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అందుకే అతనిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం నిబంధనలు అమలు చేసే క్రమంలో.. గ్రామస్తులు తమకు సహకరించలేదని చెబుతున్నారు. దుకాణాలు మూసివేయాలని చెప్పడంతో వారు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.



    ఈ ఘటనపై మరో పోలీసు అధికారి శశాంక్ జైన్ మాట్లాడుతూ..‘జామ్‌తులి గ్రామంలో కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది. దీంతో ఆంక్షలు అమలు చేయడానికి ఓ బృందం అక్కడికి వెళ్లింది. దుకాణాలు మూసివేయాలని అక్కడి వారికి పోలీసు సిబ్బంది తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం ఆవేశంతో పోలీసు సిబ్బందిని కొట్టారు. మేము ఈ ఘటనపై విచారణ చేపడుతున్నాం. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తాం. వివరాలు సేకరించిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: