• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • COOKING OIL PRICES DOWN BY 20 PERCENT IN INDIAN MARKET CHECK LATEST RATES OF EDIBLE OIL SU

Cooking Oil prices: శుభవార్త... వంట నూనెల ధరలు భారీగా తగ్గాయి... లేటెస్ట్ రేట్స్ తెలుసుకోండి

Cooking Oil prices: శుభవార్త... వంట నూనెల ధరలు భారీగా తగ్గాయి... లేటెస్ట్ రేట్స్ తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

గత కొద్ది నెలలుగా భారత్‌లో వంట నూనెల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం సామాన్యులు, మధ్యతరగతి వారిపై ఎక్కువగా పడింది.

  • Share this:
    గత కొద్ది నెలలుగా భారత్‌లో వంట నూనెల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం సామాన్యులు, మధ్యతరగతి వారిపై ఎక్కువగా పడింది. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి.. వంట నూనె వంటి నిత్యావసర సరకుల ధరలు పెరగడం మరింత భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం సామాన్యునికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. వంట నూనెల దిగుమతుల​పై పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వంట నూనెతో పాటుగా, పామాయిల్‌పై పన్ను తగ్గించింది. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు(The Central Board of Indirect Taxes and Customs) నోటిఫికేషన్ జారీచేసింది. పన్ను తగ్గింపు నేటి నుంచే(జూన్ 17) అమల్లోకి వచ్చినట్టు సీబీఐసీ పేర్కొంది.

    క్రూడ్ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 86 యూఎస్ డాలర్లు తగ్గించింది. అలాగే క్రూడ్ సోయా ఆయిల్ ధరను టన్నుకు 37 యూఎస్ డాలర్లు తగ్గించేసింది. అంతేకాకుండా ఆర్‌బీడీ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 112 డాలర్లు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వంట నూనెల ధరలు తగ్గనున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొంతకాలంగా వంట నూనెల ధరల పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూసే అని చెప్పాలి.

    ;ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే..
    1. మే 7వ తేదీన పామాయిల్ కిలోకు రూ. 142 ఉండగా.. ప్రస్తుతం రూ. 115గా ఉంది. అంటే దాదాపు 19 శాతం ధర దిగి వచ్చింది.
    2. మే 5వ తేదీన సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర కిలోకు రూ. 188 ఉంటే, ప్రస్తుతం రూ. 157 గా ఉంది. అంటే దాదాపు 16 శాతం ధర దిగి వచ్చింది.
    3. మే 5వ తేదీన సోయా ఆయిల్ మే 20వ తేదీన కిలోకు రూ. 162 ఉంటే, ప్రస్తుతం రూ. 138గా ఉంది. అంటే దాదాపు 15 శాతం దిగి వచ్చింది.
    4. మే 16న ఆవాల నూనె కిలోకు రూ. 175 ఉంటే, ప్రస్తుతం రూ. 157 గా ఉంది. అంటే దాదాపు 10 శాతం ధర దిగి వచ్చింది.
    5. మే 14న వేరుశనగ నూనె ధర కిలోకు రూ. 190 ఉంటే, ప్రస్తుతం రూ. 174 గా ఉంది. అంటే దాదాపు 8 శాతం దిగి వచ్చింది.
    6. మే 2న వనస్పతి నూనె ధర కిలో రూ. 154 ఉంటే, ప్రస్తుతం రూ. 141గా ఉంది. అంటే 8 శాతం ధర దిగి వచ్చింది.

    అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
    భారతదేశంలోని వంట నూనెల డిమాండ్‌లో 56 శాతం దిగుమతులే ఉన్నాయి. అంటే అంతర్జాతీయంగా పెరిగే ధరలు, మన దేశంలోని వంట నూనెలపై ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తినదగిన నూనెల (ఎడిబుల్ ఆయిల్స్) ధరలు ఇటీవల బాగా పెరిగాయి. వివిధ దేశాల డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్‌లలో వంట నూనెల ధరలు గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
    Published by:Sumanth Kanukula
    First published: