హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నలుగురు రేపిస్టులకు ఉరి అమలు..న్యాయం దక్కిందన్న నిర్భయ తల్లి

నలుగురు రేపిస్టులకు ఉరి అమలు..న్యాయం దక్కిందన్న నిర్భయ తల్లి

నిర్భయ తల్లి

నిర్భయ తల్లి

Nirbhaya Case: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులను తీహార్ జైల్లో ఈ ఉదయం ఐదున్నర గంటలకు ఉరితీశారు.

గతకొన్ని మాసాల హైడ్రామాకు తెరదించుతూ 2012నాటి నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులను తీహార్ జైల్లో ఉరితీశారు. ఇవాళ ఉదయం 5.30 గం.లకు నలుగురు రేపిస్టులకు ఉరిశిక్షను అమలుచేశారు. గత రెండున్నర మాసాల వ్యవధిలో మూడుసార్లు వారికి ఉరిశిక్ష అమలుకు సంబంధించిన డెత్ వారెంట్లు రద్దయ్యాయి. ఉరిశిక్ష అమలును ఆపేందుకు నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ చివరి వరకు విఫలప్రయత్నం చేశారు. ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష అమలును నిలుపుదల చేసేందుకు నిరాకరించడంతో చివరి ప్రయత్నంగా గత రాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయినా సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. సరైన కారణం లేనిదే ఉరిశిక్ష అమలును నిలుపుదల చేయలేమని, తమ సమయాన్ని వృధా చేయొద్దని నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌కు సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ సూచించింది. దీంతో ముందుగా జారీ అయిన డెత్ వారెంట్ల మేరకు ఈ ఉదయం ఐదున్నర గంటలకు నిర్భయ దోషులు నలుగురిని ఉరితీశారు. అంతకు ముందుగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి...పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్థారించుకున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వారికి ఉరిశిక్షను అమలుచేయడం పట్ల నిర్భయ తల్లి ఆశా దేవి, తండ్రి బద్రీనాథ్ సింగ్ హర్షం వ్యక్తంచేశారు. తమ కుమార్తె నిర్భయకు న్యాయం జరిగిందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని వ్యాఖ్యానించారు.

First published:

Tags: Nirbhaya case

ఉత్తమ కథలు