Home /News /national /

CONTROVERSY QUESTION ON KASHMIR IN MADHYA PRADESH SERVICE COMMISSION PRELIMINARY EXAM TWO OFFICIALS DEBARRED AK

Controversy Question on Kashmir: భారత్ కశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇవ్వాలా ?.. పరీక్షలో కనిపించిన ప్రశ్న.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kashmir: కశ్మీర్ వ్యవహారంలో పాకిస్థాన్ జోక్యాన్ని, ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కూడా భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంటుంది. అలాంటి కశ్మీర్‌ అని భారత్ పాకిస్థాన్‌కు ఇవ్వాలా ? అనే ప్రశ్న మన దేశంలో వినిపిస్తుందని ఎవరూ ఊహించలేం.

    కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఏమిటో అందరికీ తెలిసిందే. కశ్మీర్ విషయంలో తాము ఏ మాత్రం రాజీపడబోమని భారత్ పదే పదే చెబుతుంటుంది. కశ్మీర్(Kashmir) వ్యవహారంలో పాకిస్థాన్(Pakistan) జోక్యాన్ని, ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కూడా భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంటుంది. అలాంటి కశ్మీర్‌ అని భారత్ పాకిస్థాన్‌కు ఇవ్వాలా ? అనే ప్రశ్న మన దేశంలో వినిపిస్తుందని ఎవరూ ఊహించలేం. కానీ ఇలాంటి ప్రశ్న ఒకటి ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో కనిపించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్(Madhya Pradesh) పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) ప్రిలిమినరీ పరీక్షలో కశ్మీర్‌పై ఈ తరహా వివాదాస్పద ప్రశ్న అడిగారు. దీంతో ఇది ఇప్పుడు వివాదంగా తలెత్తింది. కశ్మీర్‌ను భారత్‌ పాకిస్థాన్‌కు ఇవ్వాలా అని పరీక్ష రాసే వారిని అడిగారు.

    ఈ ప్రశ్న కనిపించిన తరువాత ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పేపర్ రూపొందించడంలో పాల్గొన్న కమిషన్‌లోని ఇద్దరు అధికారులను డిబార్ చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఇందుకు సంబంధించి నాలుగు సమాధానాల ఎంపికలతోపాటు రెండు వాదనలు ఉన్నాయి. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు ఇవ్వాలని భారతదేశం నిర్ణయించుకోవాలా ? అన్నది ఇందులో కనిపించిన ప్రశ్న. అంతేకాదు దీనికి సంబంధించి నాలుగు ఆప్షన్లు కూడా రూపొందించారు. అందులో వాదన 1: అవును, ఇది భారతదేశానికి చాలా డబ్బు ఆదా చేస్తుంది; వాదన 2: లేదు, అటువంటి నిర్ణయం అటువంటి డిమాండ్లను పెంచుతుంది. నాలుగు సమాధాన ఎంపికలు - (A) వాదన 1 బలమైనవి, (B) వాదన 2 బలమైనవి, (C) వాదన 1 మరియు 2 రెండూ బలమైనవి, (D) వాదన 1 మరియు 2 రెండూ బలంగా లేవు అని ఉన్నాయి.



    పరీక్ష అనంతరం ఈ విషయం వెలుగులోకి రావడంతో వివాదం మొదలైంది. అయితే ఈ వివాదాస్పద ప్రశ్న విషయం వెలుగులోకి వచ్చిన కొద్ది సమయానికే ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. MPPSC పరీక్షలో కాశ్మీర్‌కు సంబంధించిన వివాదాస్పద ప్రశ్న అడిగే సందర్భం అభ్యంతరకరమని అన్నారు.

    Draupadi Murmu: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. ప్రధాని మోదీ లెక్కేంటి ?.. భారీ ప్లాన్

    Rahul Gandhi: ఈడీ అధికారులు నన్ను అడిగిన చివరి ప్రశ్న ఇదే.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

    వివాదాస్పద ప్రశ్న అడిగిన పేపర్ సెట్టర్లు మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందినవారని అన్నారు. వారిని భవిష్యత్తులో ప్రశ్నపత్రాలు తయారు చేయకుండా పిఎస్‌సి వారిని డిబార్ చేసిందని వెల్లడించారు. పేపర్ సెట్టర్లను డిబార్ చేశామని, వారికి ఎలాంటి పని ఇవ్వకూడదని ప్రకటించగా ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పీఎస్సీని, ఉన్నత విద్యాశాఖను కోరినట్లు తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Jammu and Kashmir, Madhya pradesh

    తదుపరి వార్తలు