• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CONSUMER PROTECTION ACT 2019 COMES INTO FORCE FROM TODAY SK

సెలబ్రిటీలకు షాక్.. సామాన్యులకు గుడ్‌న్యూస్.. ఆ యాడ్స్‌పై కఠిన చర్యలు

సెలబ్రిటీలకు షాక్.. సామాన్యులకు గుడ్‌న్యూస్.. ఆ యాడ్స్‌పై కఠిన చర్యలు

ప్రతీకాత్మక చిత్రం

మనదేశంలో ఇవాళ్టి నుంచే Consumer Protection Act, 2019 అమల్లోకి వచ్చింది. వినియోగదారుల భద్రతా చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్ గతవారమే విడుదలవగా.. దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది.

  • Share this:
    ఈ సబ్బు వాడితే చర్మం తెల్లగా మెరిసిపోతోంది. మా బండి లీటర్‌కు 100 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. ఈ నూనె‌ రాసుకుంటే బట్ట తల మటుమాయం అవుతుంది. ఇలాంటి ప్రకటనలు టీవీలు, పేపర్లు, ఇంటర్నెట్‌లో నిత్యం చూస్తూనే ఉంటాం. ఎక్కువా సినీ, స్పోర్ట్స్ స్టార్సే ఇలాంటి యాడ్స్‌లో కనిపిస్తారు. తమ ఫేవరేట్ హీరో చెప్పాడని.. తనకు ఇష్టమైన ప్లేయర్ వాడుతున్నాడని.. ఎంతో మంది ఆ ప్రాడక్ట్స్‌ను వాడుతున్నారు. కానీ ఎన్ని రోజులు వాడినా ఫలితం మాత్రం శూన్యం. ఇలా నిరాశ చెందిన వారు మనలో చాలా మంది ఉన్నారు. ఐతే ఇకపై అలాంటి ప్రకటనల్లో కనిపించే సెలబ్రిటీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

    ఎందుకంటే.. మనదేశంలో ఇవాళ్టి నుంచే Consumer Protection Act, 2019 అమల్లోకి వచ్చింది. వినియోగదారుల భద్రతా చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్ గతవారమే విడుదలవగా.. దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఏదేని ఉత్పత్తికి సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఉంటే.. దానికి ఉత్పత్తిదారుడు పూర్తి బాధ్యత వహించాలని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. వినియోగదారులు ఇకపై ఎక్కడి నుంచైనా ఏ ప్రాడక్ట్‌పైనైనా ఫిర్యాదు చేయవచ్చు. లేఖ లేదా ఫోన్ కాల్ లేదా ఫోన్ సందేశం ద్వారా తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) చర్యలు తీసుకుంటుంది.


    అంతేకాదు వినియోగదారుల భద్రతా చట్ట నిబంధనల ప్రకారం ఏ కంపెనీ కూడా తమ వినియోగదారుల సమాచారాన్ని ఎక్కడా బహిర్గతం చేయకూడదు. ఎవరితోనూ పంచుకోకూడదు. వస్తువులను కొన్న తర్వాత కాదు.. కొనకముందే వాటి నాణ్యతపై ఫిర్యాదులు చేసే హక్కును సామాన్యులకు ఈ చట్టం కట్టబెట్టింది. ఏదేని ప్రొడక్ట్‌కు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే.. కంపెనీతో పాటు ఆ యాడ్‌లో కనిపించిన సెలబ్రిటీలపైనా కేసులు పెడతారు. గరిష్టంగా రూ.50 లక్షల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. భవిష్యత్‌లో మళ్లీ యాడ్స్‌లో నటించకుండా నిషేధం కూడా విధిస్తారు. ఈ-కామర్స్ సైట్లకు కూడా ఇది వర్తిస్తుంది. వినియోగదారులకు న్యాయం చేసేందుకే ఈ చట్టాన్ని తెచ్చినట్లు కేంద్రం తెలిపింది.
    Published by:Shiva Kumar Addula
    First published: