Home /News /national /

CONSULTATION PAPER ON CRYPTO ALMOST READY SAYS ECONOMIC AFFAIRS SECRETARY AJAY SETH PVN

Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక ప్రకటన.. త్వరలోనే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Consultation paper on crypto: క్రిప్టోకరెన్సీ(Cryptocurrency)లపై కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. క్రిప్టోలపై త్వరలోనే కన్సల్టేషన్ పేపర్​తో ముందుకు రానున్నట్లు ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అజయ్ సేఠ్ వెల్లడించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దీనిపై ప్రకటన చేశారు.

ఇంకా చదవండి ...
Consultation paper on crypto: క్రిప్టోకరెన్సీ(Cryptocurrency)లపై కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. క్రిప్టోలపై త్వరలోనే కన్సల్టేషన్ పేపర్​తో ముందుకు రానున్నట్లు ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అజయ్ సేఠ్ వెల్లడించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దీనిపై ప్రకటన చేశారు. ఏదైనా ఓ అంశంపై నిపుణుల అభిప్రాయాలను తీసుకొని రూపొందించే పత్రాన్నే కన్సల్టేషన్ పేపర్ అంటారు. కన్సల్టేషన్ పేపర్ రూపకల్పన తుది దశకు చేరుకుందని.. త్వరలోనే దీన్ని విడుదల చేస్తామని ​ అజయ్ సేఠ్ చెప్పారు. కన్సల్టేషన్ పేపర్​ను రూపొందించేందుకు దేశీయ నిపుణులనే కాకుండా ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్​లను సైతం సంప్రదించినట్లు తెలిపారు.

క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ లేనందున ఇందుకోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాలన్నారు. క్రిప్టో విసిరే సవాళ్లను అంతర్జాతీయ స్థాయిలో ఓ అంగీకారంతో ఎదుర్కోవాలని అన్నారు. ఈ మేరకు విస్తృతమైన ఫ్రేమ్​వర్క్ రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నిబంధనలు రూపొందించే విషయంపై ఇప్పటి నుంచే తాము పనిచేస్తున్నట్లు అజయ్ సేఠ్ తెలిపారు. కాగా కేంద్రం ఇప్పటికే క్రిప్టోలపై 30 శాతం పన్ను విధిస్తోంది. వీటికి దేశంలో చట్టబద్ధత లేదు. అలాగే క్రిప్టో కరెన్సీలపై 28 శాతం జీఎస్‌టీ కూడా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ALSO READ Abhishek Banerjee: బెంగాల్ లో మళ్లీ టీఎంసీ వర్సెస్ గవర్నర్..మమత మేనల్లుడిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశాలు

మరోవైపు, ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ గత కొన్ని వారాలుగా పడిపోతూనే వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ విలువ పైకి చేరింది. మళ్లీ 30 వేల డాలర్ల పైకి కదిలింది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా లాభపడింది. బిట్ కాయిన్ రేటు మే 30న భారీగా పెరిగింది. 5.62 శాతానికి పైగా ర్యాలీ చేసింది. 30,613 డాలర్లకు ఎగసింది. అలాగే ప్రపంచంలోని రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన ఇథీరియం కూడా దూసుకుపోయింది. 7 శాతానికి పైగా ర్యాలీ చేసింది. మళ్లీ 1900 డాలర్ల పైకి చేరింది.

క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి?
క్రిప్టో కరెన్సీ కూడా డిజిటల్ కరెన్సీనే. ఇది వర్చువల్ కరెన్సీ. అయితే డిజిటల్ కరెన్సీపై కేంద్రం లేదా ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల నియత్రణ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ నిర్వహణ బాధ్యతను ఇవి చూసుకుంటాయి. అయితే ఇక్కడ క్రిప్టోకరెన్సీల విషయానికి వస్తే.. వీటిపై ఎవరి నియంత్రణ ఉండదు. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. క్రిప్టోకరెన్సీల విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. బ్లాక్‌యెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీలు పనిచేస్తాయి. క్రిప్టోకరెన్సీల్లో చాలా రకాలు ఉన్నాయి. ఏ కరెన్సీ మంచిదో ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే డబ్బులు సంపాదించొచ్చు. లేదంటే డబ్బులు పోగొట్టుకోవాలసి రావొచ్చు. ఏ కొత్త టెక్నాలజీ అయినా అందులో రివార్డులతో పాటు రిస్క్ కూడా పొంచి ఉంటుంది. అందువల్ల ముందుగానే డిజిటల్ కరెన్సీ గురించి బాగా తెలుసుకోవాలి. తాజా అధ్యయనాల ప్రకారం చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన క్రిప్టోకరెన్సీలు...బిట్‌కాయిన్, ఇథీరియమ్, డాష్, మొనెరో, రిపుల్, లైట్‌కాయిన్.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Crypto, Cryptocurrency

తదుపరి వార్తలు