ఢిల్లీలో మళ్లీ చెలరేగిన అల్లర్లు... కానిస్టేబుల్ మృతి

ప్రస్తుతం ఆయా ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎవరైనా కనిపిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

news18-telugu
Updated: February 24, 2020, 4:39 PM IST
ఢిల్లీలో మళ్లీ చెలరేగిన అల్లర్లు... కానిస్టేబుల్ మృతి
ఢిల్లీలో మళ్లీ చెలరేగిన అల్లర్లు... కానిస్టేబుల్ మృతి
  • Share this:
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భజన్ పూర్, మౌజ్ పూర్, కబీర్ నగర్ ప్రాంతాల్లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు. ఓ ఆటో రిక్షాను నిరసన కారులు తగులబెట్టారు. పలువురు గన్‌లు కూడా తీసుకొచ్చారు. రోడ్డు డివైడర్లను పగులగొట్టి ఆ రాళ్లను పోలీసులకు విసిరారు. దీంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో శాంతి భద్రతలపై లెఫ్టెనంట్ గవర్నర్, కేంద్రమంత్రి అమిత్ షా స్పందించి... అదుపులోకి తీసుకురావాలన్నారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు మరిన్ని బలగాల్ని కేంద్రం ఢిల్లీకి తరలించింది. నిన్న కూడా జఫరాబాద్, మౌజ్ పూర్ ఏరియాలో అల్లర్లు జరిగాయి. సీఏకు అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలతో ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అయితే రోడ్లను బంధించి ఆందోళనలు చేయడం పట్ల పలువురు అభ్యంతరాలువ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై అనుకూల వ్యతిరేక వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎవరైనా కనిపిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిన్న కూడా జఫరాబాద్ ఏరియలో మెట్రో స్టేషన్ వద్ద సీఏకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో అధికారులు మెట్రో స్టేషన్‌ను మూసివేసి పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ముస్లీ జనాభా ఎక్కువగా ఉన్న ఈ మూడ ప్రాంతాల్లో నిన్నమొన్నటి వరకు సీఏకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సీఏకు అనుకూలంగా కూడా కొంతమంది ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు.



First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు