Home /News /national /

CONSENT OF FAMILY OR COMMUNITY NOT NECESSARY WHEN TWO ADULTS AGREE TO MARRY SAYS SUPREME COURT MS

Inter Caste Marriages: వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకుంటే పెద్దల అంగీకారం అక్కర్లేదు : సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు (ఫైల్ ఫొటో)

సుప్రీంకోర్టు (ఫైల్ ఫొటో)

Supreme Court On Inter caste Marriages: సామాజిక కట్టుబాట్లు తొలిగిపోవాలంటే కులాంతర, మతాంతర వివాహాలే మేలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇద్దరు మేజర్లు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకోవాలనుకుంటే వారి తల్లిదండ్రులతో పాటు కుల పెద్దలు, ఇతరుల అంగీకారం అవసరం లేదని తెలిపింది.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
    మన సమాజంలో వేల సంవత్సరాలుగా నాటుకుపోయిన అంతరాలను, ప్రజల మధ్య ఏర్పడిన సామాజిక కట్టుబాట్లు తొలిగిపోవాలంటే కులాంతర, మతాంతర వివాహాలే మేలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇద్దరు మేజర్లు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకోవాలనుకుంటే వారి తల్లిదండ్రులతో పాటు కుల పెద్దలు, ఇతరుల అంగీకారం అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ సంచలన తీర్పును వెల్లడించారు.

    ఇందుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. కర్నాటకకు చెందిన ఒక ప్రేమ జంట.. ఇరు వైపుల తల్లిదండ్రులకు చెప్పకుండా ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి తరఫున.. ఆమె తండ్రి తన కూతురు కనిపించడం లేదని కేసు పెట్టాడు. పెళ్లి చేసుకున్న అబ్బాయే తన కూతురును కిడ్నాప్ చేశాడని అందులో ఆరోపించారు. అయితే ఆ జంట పెళ్లి చేసుకున్నారన్న విషయం ఆ తల్లిదండ్రులకు తెలిసింది. అయినా కూడా అమ్మాయి తల్లిదండ్రులు కేసును వెనక్కి తీసుకోలేదు. దీంతో సదరు పోలీసు అధికారులు.. వారికి పదే పదే ఫోన్ చేసి సంతకం పెట్టిపోవాల్సిందిగా వేధించారు. లేకుంటే తన భర్తపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సి ఉంటుందని బెదిరించారు. దీంతో ఆ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ... చదువుకున్న యువతీ యువకులు సమాజంలో నాటుకుపోయిన కట్టుబాట్లకు, కుల వివక్షకు వ్యతిరేకంగా వారికి నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారని తెలిపింది. దీనిని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని సూచించింది. ఇలాంటి వివాహాల వల్ల సమాజంలో అంతరాలు తగ్గిపోతాయని కోర్టు పేర్కొన్నది. ఈ వివాహాల ద్వారా యువతీ యువకులు వారి పెద్దల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటారని.. అయితే కోర్టులు వారికి సహకరిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

    ఈ సందర్భంగా కోర్టు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ‘కుల నిర్మూలన’ను ఊటంకిస్తూ... కులంచే సృష్టించబడిన వేర్పాటువాద భావనను పారదోలాలంటే దానికి నిజమైన పరిష్కారం కులాంతర, మతాంతర వివాహాలే అని తెలిపిన విషయాన్ని గుర్తు చేసుకున్నది.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Karnataka, Love marriage, Marriage, Supreme Court

    తదుపరి వార్తలు