Twins Operation: మన వీణా వాణి అలాంటి కవలలకు ఆపరేషన్.. తరువాత ఏం జరిగిందంటే..

Twins Operation: తెలుగు రాష్ట్రంలో పుట్టిన వీణా-వాణిలు (veena-vani) కూడా అవిభక్త కవలలుగా ప్రసిద్ధి గాంచారు. ఇటీవలే 10వ తరగతి పూర్తి చేసుకున్న ఈ అవిభక్త కవలలను విడదీసేందుకు దేశ విదేశాలకు చెందిన వైద్యులు పలుమార్లు పరీక్షలు జరిపినా ఉపయోగం లేకపోయింది.

news18-telugu
Updated: November 26, 2020, 12:04 PM IST
Twins Operation: మన వీణా వాణి అలాంటి కవలలకు ఆపరేషన్.. తరువాత ఏం జరిగిందంటే..
అవిభక్త కవలలు వీణ-వాణి(ఫైల్ ఫోటో)
  • Share this:
అవిభక్త కవలలుగా పేరుగాంచిన జాగా, కాలియాల్లో కాలియా అనే బాలుడు మృతిచెందడం ఒరిస్సాలో విషాదం నింపింది. కాగా కవల సోదరుల్లో ఒకరైన జాగా మాత్రం ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అరుదుగా జన్మించే అవిభక్త కవలలను శస్త్ర చికిత్స (surgery) ద్వారా విడదీయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ కాగా వీరిని ఎయిమ్స్ (AIMS) వైద్యులు సర్జరీ ద్వారా విడదీశారు. ఆ తరువాత కొద్ది కాలానికి వీరిని ఒరిస్సా ఆసుపత్రికి తరలించారు. కానీ ఉన్నట్టుండి అనారోగ్యంపాలైన కాలియా పరిస్థితి విషమించి చివరికి తుది శ్వాస వదిలడం అందరినీ కలచివేస్తోంది.

విషమించిన ఆరోగ్యం

5 రోజుల క్రితం కాలియా పరిస్థితి విషమిస్తూ వచ్చింది, వెంటిలేటర్ పైన 2 రోజులుగా చికిత్స అందిస్తున్నప్పటికీ కాలియా స్పందించలేదు. సెప్టిసీమియా (septicaemia) వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని రక్షించేందుకు వైద్య బృందం తీవ్రంగా శ్రమించినా ఉపయోగం లేకపోయింది. ఒరిస్సాలోని కటక్ లోని SCB మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని ఐసీయూ ట్రౌమా సెంటర్ లో చికిత్స పొందుతూ కాలియా మృతిచెందాడు.

మీడియా ద్వారా..
కంధమాల్ జిల్లాలోని మిలిపాదా గ్రామానికి చెందిన నిరుపేదలైన గిరిజన దంపతులు పుష్పాంజలి కన్హర్, భుయన్ కన్హర్ లకు జన్మించిన ఈ అవిభక్త కవల కథనం తొలుత స్థానిక మీడియాలో వచ్చింది. ఈ అవిభక్త కవలల వార్తలు ప్రసారం కాగా ఇది రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆతరువాత రాష్ట్ర ప్రభుత్వం వీరి చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చి, ఎయిమ్స్ కు పంపింది. ఎయిమ్స్ లో ఎన్నో పరీక్షలు, వివిధ దశల్లో వీరి చికిత్సా విధానం పూర్తయ్యాక సుదీర్ఘ ఆపరేషన్ తో వీరిద్దరిని విడదీశారు. 18-45 గంటలపాటు శ్రమించిన ఎయిమ్స్ వైద్య బృందం విజయవంతంగా వీరిని విడదీసే ఆపరేషన్ పూర్తి చేసింది.

కటక్ మెడికల్ కాలేజ్‌లో చికిత్స
2017లో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వీరి ఆపరేషన్ జరుగగా, 2019సెప్టంబరు నుంచి వీరు కటక్ మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్నారు. కాలియా ఆరోగ్యం విషమించి, 2 రోజులపాటు వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ తరువాత కవలల్లో ఒకరు బుధువారం కన్నుమూయడం వైద్య శాస్త్రంలో ఒక సవాలుగా నిలిచిందని వైద్యులు చెబుతున్నారు.

కంధమాల్ లో తమ కుమారుడు అంత్యక్రియలు నిర్వహించిన తల్లిదండ్రులు కటక్ మెడికల్ కాలేజ్ లో ఉన్న మరో కుమారుడి వద్దకు చేరుకున్నారు. కాగా ఈ కవలలకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. వీరు మాత్రం సాధారణంగా జన్మించడంతో వీరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు.

వీణా-వాణిలు
తెలుగు రాష్ట్రంలో పుట్టిన వీణా-వాణిలు (veena-vani) కూడా అవిభక్త కవలలుగా ప్రసిద్ధి గాంచారు. ఇటీవలే 10వ తరగతి పూర్తి చేసుకున్న ఈ అవిభక్త కవలలను విడదీసేందుకు దేశ విదేశాలకు చెందిన వైద్యులు పలుమార్లు పరీక్షలు జరిపినా ఉపయోగం లేకపోయింది. సుమారు 10 కోట్లకు పైగా వీరి వైద్య ఖర్చులవుతాయనే అంచనా ఉండగా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుంది. చాలాకాలంపాటు హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలోనే వీరి బాల్యం గడిచింది. వీరికి ఎక్కువ కాలంపాటు చికిత్స చేసిన డాక్టర్ నాయుడమ్మ (Dr. Nayudamma) రిటైర్ అయ్యాక ఇక వీరిని విడదీసే శస్త్ర చికిత్స చేసేందుకు ఏ వైద్యులు సాహసం చేయలేకపోతున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: November 26, 2020, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading