కృష్ణాష్టమి (Krishnashtami) సందర్భంగా... మధ్యప్రదేశ్ ప్రతిపక్ష కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు రిలీజ్ చేశారు. వాటిలో మాజీ సీఎం కమలనాథ్ (Kamal Nath)ని శ్రీకృష్ణుడిగా చూపించారు. అలాగే అధికార పార్టీ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj singh chouhan)ను కంసుడిగా చిత్రీకరించారు. ఇది ఇప్పుడు రాజకీయంగా భోపాల్ (bhopal)లో కాక రేపుతోంది.
రాజకీయ వ్యూహాలు: రెండేళ్లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో (MP Assembly Elections) విజయం కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. జ్యోతిరాదిత్య సింథియా కారణంగా... ఏడాదిన్నర కిందట అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ (Congress)... చరిత్రను తిరగరాయాలి అనుకుంటోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఓవైపు అధికార బీజేపీ (BJP)పై విమర్శలు ఎక్కుపెడుతూ... మరోవైపు తమ నేత కమలనాథ్ను ఆకాశానికి ఎత్తేయాలన్నది కాంగ్రెస్ ప్లాన్‌గా కనిపిస్తోంది.
పోస్టర్ల వివాదం: ప్రస్తుతం భోపాల్ అంతటా... పోస్టర్లు కనిపిస్తున్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీ ఆఫీసు బయట కూడా ఈ పోస్టర్లను అతికించారు. తద్వారా బీజేపీ నేతలను రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్లను బట్టే చెప్పొచ్చు... ప్రజలు మళ్లీ కమలనాథ్ పాలన రావాలని కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెబుతారు అని కాంగ్రెస్ నేత షయార్ ఖాన్ అన్నారు.
A poster depicting Congress' Kamal Nath as Lord Krishna & Madhya Pradesh CM Shivraj Singh Chouhan as 'Kans Mama' was put up outside Cong office, Bhopal.
Through this poster, people are urging Kamal Nath Ji to contest 2023 polls & teach BJP a lesson:Shahyar Khan, Congress(31.08) pic.twitter.com/QDsy1W1NX0
— ANI (@ANI) August 31, 2021
"ప్రజలు కమలనాథ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెబుతారు. భూమిపై పాపాలు పెరిగిపోతున్నాయి. అభివృద్ధి చేసే నేతగా కమలనాథ్ను దేవుడు పంపించాడు. ఆయన చేపట్టిన చింద్వారా మోడల్... రాష్ట్ర అభివృద్ధికి ఆదర్శపూర్వకమైన ఉదాహరణ. అలాంటిది శివరాజ్ సింగ్ ఇప్పటివరకూ చెయ్యలేదు" అని ఖాన్ ANI న్యూస్ ఏజెన్సీతో అన్నారు.
ఇది కూడా చదవండి: మమ్మల్ని సెక్స్ చేసుకోమన్నారు. ఏడుగురు పోలీసులపై ఇద్దరు వ్యక్తుల ఆరోపణ
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరుగుతాయి. 2020లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జ్యోతిరాదిత్య సింథియా వర్గంలోకి వెళ్లిపోవడంతో... కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ పాలనా పగ్గాలు చేపట్టింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి సీఎం అయ్యారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.