• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CONGRESS VETERAN SATISH SHARMA CREMATED RAHUL GANDHI PAYS RESPECT SU

Rahul Gandhi: మాజీ కేంద్ర మంత్రి సతీష్ శర్మ అంత్యక్రియలు.. స్వయంగా పాడె మోసిన రాహుల్ గాంధీ..

Rahul Gandhi: మాజీ కేంద్ర మంత్రి సతీష్ శర్మ అంత్యక్రియలు..  స్వయంగా పాడె మోసిన రాహుల్ గాంధీ..

మాజీ కేంద్ర మంత్రి సతీష్ శర్మ పాడె మోసిన రాహుల్ గాంధీ.. (Image-Twitter)

మాజీ కేంద్ర మంత్రి కెప్టెన్ సతీష్ శర్మ మృతికి కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది. ఆయన భౌతిక కాయానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు నివాళులర్పించారు.

  • Share this:
    మాజీ కేంద్ర మంత్రి కెప్టెన్ సతీష్ శర్మ మృతికి కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది. ఆయన భౌతిక కాయానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు నివాళులర్పించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సతీష్ శర్మ అంత్యక్రియల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ శర్మ భౌతిక కాయాన్ని రాహుల్ గాంధీ స్వయంగా మోశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. "రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ దివంగత కెప్టెన్ సతీష్ శర్మకు వినయపూర్వకమైన నివాళులను అర్పించడం జరిగింది. దేశ ప్రజలకు సతీష్ శర్మ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి" అని పేర్కొంది. ఇక, సతీష్ శర్మ గాంధీల కుంటుబానికి సన్నిహితుగా పేరుగాంచిన సంగతి తెలిసిందే.

    1947లో సికింద్రాబాద్‌లో జన్మించిన సతీశ్‌ శర్మ తొలుత కమర్షియల్‌ పైలెట్‌గా విధులు నిర్వహించారు. యూఎస్‌లోని కాన్సాస్ సిటీలో ఆయన శిక్షణ పొందారు. రాజీవ్ గాంధీ స్నేహితుడైన సతీష్ శర్మ.. పైలట్ వృత్తిన వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇందిరా గాంధీ హత్య అనంతరం రాజీవ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకు.. కాంగ్రెస్ పార్టీ సతీష్ శర్మను రాజ్యసభకు నామినేట్ చేసింది. 1986లో శర్మ తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత అమేథీలో జరిగిన ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన సతీష్ శర్మ.. లోక్‌సభకు ఎన్నికయ్యారు.





    గాంధీల కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలి, అమేథి నియోజకవర్గాల నుంచి సతీష్ శర్మ మొత్తం మూడు సార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని పీవీ నరసింహ నేతృత్వంలోకి కాంగ్రెస్ ప్రభుత్వంలో.. 1993 నుంచి 1196 వరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా కొనసాగారు. ఇక, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం గోవాలో కన్నుమూశారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.



    సతీష్ శర్మ మృతిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త బాధించిందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు రాహుల్‌ గాంధీ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: