బీజేపీలోకి సింధియా ఎంట్రీ వాయిదా.. ముహూర్తం ఎప్పుడంటే..?

సింధియాకు బీజేపీ రాజ్యసభ టికెట్ ఆఫర్ చేసిందని.. ఆ తర్వాత కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ఈ నేపథ్యంలో అదేరోజు ఆయన రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: March 10, 2020, 8:05 PM IST
బీజేపీలోకి సింధియా ఎంట్రీ వాయిదా.. ముహూర్తం ఎప్పుడంటే..?
జ్యోతిరాదిత్య సింధియా
  • Share this:
మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో సంక్షోభం సృష్టించిన జ్యోతిరాదిత్య సింధియా పేరు ఇప్పడు దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. కాంగ్రెస్‌కు ఇప్పటికే రాజీనామా చేసిన ఆయన.. బీజేపీలో చేరబోతున్నారు. ఐతే సింధియా బీజేపీలో చేరతాని ప్రచారం జరిగింది. ఐతే ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోనే ఆయన బీజేపీలో చేరతారని తెలుస్తోంది. తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి కమల తీర్థం పుచ్చుకోనున్నారు సింధియా. ఆయనకు బీజేపీ రాజ్యసభ టికెట్ ఆఫర్ చేసిందని.. ఆ తర్వాత కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ఈ నేపథ్యంలో అదేరోజు సింధియా రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.

230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. ఇక నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు BSP సభ్యులు, ఒక SP ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించడంతో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం మెజార్టీ మార్కు 115. ఐతే కాంగ్రెస్‌కు 20 మంది ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పడంతో.. కమల్‌నాథ్ ప్రభుత్వం బలం 94కు తగ్గి, మైనార్టీలో పడింది. ఇక ఈ 22 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ బలం 129కు చేరుతుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, కమల్‌నాథ్‌ను గద్దె దింపాలని భావిస్తోంది కమల దళం. అవిశ్వాస తీర్మానంలో కమల్‌నాథ్ ఓడిపోయిన వెంటనే.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వ్యూహాలు రచిస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: March 10, 2020, 8:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading