CONGRESS TOP BODY PICKS SONIA GANDHI AS INTERIM CONGRESS PRESIDENT MK
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఎంపిక...సీడబ్ల్యూసీ నిర్ణయం
సోనియా గాంధీ (ఫైల్ చిత్రం)
కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మరోసారి సోనియా గాంధీకే అప్పగిస్తూ సీడబ్ల్యుసీ నిర్ణయం తీసుకుంది. అయితే తాత్కాలిక అధ్యక్షురాలి హోదాలో ఆమె కొనసాగనున్నారు. సుదీర్ఘ తర్జన భర్జనల అనంతరం రాహుల్ స్థానంలో సోనియాకే మరో సారి సీడబ్ల్యూసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శనివారం రాత్రి రెండోసారి సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మరోసారి సోనియా గాంధీకే అప్పగిస్తూ సీడబ్ల్యుసీ నిర్ణయం తీసుకుంది. అయితే తాత్కాలిక అధ్యక్షురాలి హోదాలో ఆమె కొనసాగనున్నారు. సుదీర్ఘ తర్జన భర్జనల అనంతరం రాహుల్ స్థానంలో సోనియాకే మరో సారి సీడబ్ల్యూసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరే ఇతరుల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వెళితే పార్టీ చీలడం ఖాయమనే అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసకున్నట్లు పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. కాగా శనివారం ఉదయం రెండు సార్లు సీడబ్ల్యూసీ సమావేశమైంది. అయితే ఈ భేటీల్లో పార్టీ అధ్యక్ష పదవిలో రాహుల్ గాంధీయే కొనసాగాలని అత్యధిక ఎంపీలు, పీసీసీ చీఫ్లు, రాష్ట్రాల నేతలు కోరారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తన రాజీనామాను వెనుకకు తీసుకునేది లేదని రాహుల్ గాంధీ శనివారం ఉదయమే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ చీఫ్ నియామకం కోసం ఆ పార్టీ సీనియర్ నేతలలంతా తీవ్రంగా మేథో మధనం చేశారు. పార్టీలోని సీనియర్ నేతలు అయిదు బృందాలుగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి కోసం కసరత్తు చేశారు. అయితే సమావేశం ఆరంభంలో కొద్దిసేపు పాల్గొన్న సోనియా, రాహుల్ గాంధీలు ఆ తర్వాత సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.