రాహుల్ గాంధీకి శివసేన చురక...సావర్కర్ దేశానికి గర్వకారణమంటూ సంజయ్ రౌత్ ట్వీట్..

వినాయక్ సావర్కర్ దేశానికి గర్వకారణం అని నెహ్రూ, గాంధీల మాదిరిగానే సావర్కర్ కూడా తన జీవితాన్ని దేశ సేవలో త్యాగం చేశారని రౌత్ పేర్కొన్నారు.

news18-telugu
Updated: December 14, 2019, 11:00 PM IST
రాహుల్ గాంధీకి శివసేన చురక...సావర్కర్ దేశానికి గర్వకారణమంటూ సంజయ్ రౌత్ ట్వీట్..
శివసేన లోగో
  • Share this:
ఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన తప్పుబట్టింది. సావర్కర్ విషయంలో తాము రాజీపడేది లేదని శివసేన తెలిపింది. హిందూత్వ కోసం పాటుపడిన వారి విషయంలో శివసేన వైఖరి స్పష్టంగా ఉంటుందని, మరో కోణానికి తావు లేదని శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. వినాయక్ సావర్కర్ దేశానికి గర్వకారణం అని నెహ్రూ, గాంధీల మాదిరిగానే సావర్కర్ కూడా తన జీవితాన్ని దేశ సేవలో త్యాగం చేశారని రౌత్ పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమంలోని మహనీయులను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని పేర్కొన్నారు. అందులో తాము రాజీపడేది లేదని రౌత్ తెలిపారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని నూతన సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన కూడా భాగస్వామ్యపక్షంగా ఉంది. ఢిల్లీ ర్యాలీలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై శివసేన స్పందన ఏంటా అని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నారు.First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>