• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CONGRESS SENIOR LEADER KAPIL SIBAL COUNTER TO RAHUL GANDHI AK

Rahul Gandhi: రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత కౌంటర్

Rahul Gandhi: రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత కౌంటర్

రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

Congress Crisis: కొందరు నేతలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ లేఖ చేయడం వల్ల బీజేపీకి సహకరించినట్టు అవుతుందని సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే.. కపిల్ సిబల్ దీనిపై ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు.

  • Share this:
    Congress Crisis: రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబల్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో సమూల మార్పులు రావాల్సి ఉందని పార్టీ నాయకత్వానికి లేఖ రాసిన నేతల తీరును రాహుల్ గాంధీ తప్పబట్టడంపై సీనియర్ నేత కపిల్ సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు నేతలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ లేఖ చేయడం వల్ల బీజేపీకి సహకరించినట్టు అవుతుందని సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే.. కపిల్ సిబల్ దీనిపై ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. తాము బీజేపీతో కలిశామని రాహుల్ గాంధీ అన్నారని.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ కూలిపోకుండా హైకోర్టులో తాము పోరాడని ఆయన అన్నారు. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం దిగిపోయేలా చేశామని గుర్తు చేశారు. గత 30 ఏళ్లలో తాము ఎన్నడూ బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయలేదని ఆయన అన్నారు. అయినా తాము బీజేపీతో కలిశామా ? అని వ్యాఖ్యానించారు.



    కొద్దిసేపటి క్రితం మొదలైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వాడీవేడీగా సాగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకునేందుకు సోనియా గాంధీ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి క్లారిటీ ఇచ్చారు. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను మొదలుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు సోనియాగాంధీకి సూచించారు. మరోవైపు సోనియాగాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. పార్టీకి చెందిన 23 మంది లేఖ రాయడం క్రూరమైన చర్య అని మరో మాజీ కేంద్రమంత్రి ఆంటోనీ అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు