ఖాళీ అవుతున్న కాంగ్రెస్... భారీగా తగ్గిన విరాళాలు... జీతాలకే దిక్కులేదు...

National Congress Party : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ... ఈ స్థాయిలో పతనం అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. పరిస్థితి ఎలా తయారైందంటే... చివరకు నిధుల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 18, 2019, 6:07 AM IST
ఖాళీ అవుతున్న కాంగ్రెస్... భారీగా తగ్గిన విరాళాలు... జీతాలకే దిక్కులేదు...
అయితే అసలు కాంగ్రెస్‌లో ఈ కల్లోలానికి కారణమేంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ, లోక్‌సభ పక్షంలో జరుగుతున్న మార్పులు కూడా ఇందుకు ఓ కారణమనే వాదనలు మొదలయ్యాయి. ఆజాద్ వంటి నేతలు కూడా అధిష్టానానికి ధిక్కార స్వరం వినిపించడం వెనుక ఇదే కారణం ఉందనే చర్చ సాగుతోంది.
  • Share this:
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం అమేథీలో తనే ఓడిపోవడం, ఆ తర్వాత పార్టీ ఓటమికి బాధ్యతగా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం (ఇంకా ఆమోదించలేదు), లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అవ్వడం వంటి అంశాలు... ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసినట్లు కనిపిస్తోంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ 52 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేకపోయింది. 134 సంవత్సరాల పార్టీ... 49 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీ... ఇప్పుడు డబ్బులు లేక... ఢిల్లీలోని AICC కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా తగ్గించుకోవాల్సిన దుస్థితికి వచ్చేసింది. ఆ పార్టీ సోషల్ మీడియా కేంద్రంలో ఇదివరకు 55 మంది సిబ్బంది ఉండేవారు... జీతాలు ఇవ్వట్లేదని 20 మంది రాజీనామా చేశారు. లక్కీగా కాంగ్రెస్ పార్టీకి దేశమంతా అన్ని చోట్లా భవనాలూ, ఆస్తులూ ఉన్నాయి. అవి కొంతవరకూ ఆ పార్టీని కాపాడుతున్నాయి. లేదంటే పూర్తిగా ఖాళీ అయిపోయేదే.

ఇదే సమయంలో బీజేపీకి నిధులు వరదలా వస్తున్నాయి. 2017లో రాజకీయ పార్టీలకు విరాళాలు... బాండ్ల రూపంలో ఇవ్వొచ్చని ప్రధాని మోదీ కొత్త స్కీం తేవడంతో... నిధులు ప్రవాహంలా వస్తున్నాయి. అఫ్‌కోర్స్ ఆ నిధుల్లో చాలా వరకూ నల్లధనమే అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. బాండ్లు కొన్న కార్పొరేట్ కంపెనీలకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

2017-18లో సీపీఎం తప్ప... మిగతా ఆరు జాతీయ పార్టీలకు దాతల నుంచీ రూ.467 కోట్లు వచ్చాయి. ఇది మొత్తం వైట్ మనీ. అదే బ్లాక్ మనీగా రూ.689 కోట్లు వచ్చాయి. ఇందులో బీజేపీ వాటా వెయ్యి కోట్ల రూపాయలకు పైనే. సెకండ్ పొజిషన్‌లో ఉన్న కాంగ్రెస్‌కి వచ్చింది రూ.36.5 కోట్లే. బీజేపీకి రెట్టింపు ఆదాయం వచ్చింది. ఈ విరాళాల్లో 53 శాతం బ్లాక్ మనీ అని స్పష్టమైంది. అలాంటి మనీని పార్టీలు విరాళాలుగా తీసుకుంటుంటే... ఇక నల్లధనం, అవినీతి ఎలా అంతమవుతాయి? మీరే ఆలోచించండి.
Published by: Krishna Kumar N
First published: July 18, 2019, 6:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading