హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Drugs: రూ. 21 వేల కోట్ల డ్రగ్స్ వ్యవహారంపై నిర్లక్ష్యమా ?.. విచారణకు కాంగ్రెస్ డిమాండ్

Drugs: రూ. 21 వేల కోట్ల డ్రగ్స్ వ్యవహారంపై నిర్లక్ష్యమా ?.. విచారణకు కాంగ్రెస్ డిమాండ్

కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా(ఫైల్ ఫోటో)

కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా(ఫైల్ ఫోటో)

Congress: భారీ స్థాయిలో హెరాయిన్ వెలుగులోకి రావడం వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని.. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన తాలిబన్ల హస్తం ఉందని అనుమానం ఉన్న ఈ డ్రగ్స్ వ్యవహారంలో జాతీయ భద్రతా సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది.

ఇంకా చదవండి ...

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారంపై కాంగ్రెస్ అధికార బీజేపీని టార్గెట్ చేసింది. ఈ స్థాయిలో దేశంలోకి డ్రగ్స్ రావడం వెనుక ఉన్నది ఎవరో బయటపెట్టాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. దేశ నిఘా వ్యవస్థల పనితీరును కూడా ఆయన ప్రశ్నించారు. వీటిని ఎవరు అరికడతారని వ్యాఖ్యానించారు. ముంద్రా పోర్టు వర్గాలు ఈ వ్యవహారంపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని నిలదీశారు. ఒక పోర్టులో రూ. 21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టుబడటం దేశంలో ఇదే తొలిసారి అని సుర్జేవాలా అన్నారు. వీటిపై నిఘా పెట్టాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ, డీఆర్ఐ వంటి సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఈ డ్రగ్స్ కారణంగా దేశంలోని యువత జీవితం నాశనం అవుతోందని అన్నారు.

ఇటీవల జులైలో ఢిల్లీ పోలీసులు రూ. 2500 కోట్ల విలువ చేసే 354 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నారు. దీని వెనుక ఎవరున్నారనే విషయాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షా 75 వేల కోట్ల రూపాయల విలువైన 2500 కేజీల హెరాయిన్ ఇప్పటివరకు పట్టబడలేదని కాంగ్రెస్ నేత సుర్జేవాలా అన్నారు.

భారీ స్థాయిలో హెరాయిన్ వెలుగులోకి రావడం వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని.. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన తాలిబన్ల హస్తం ఉందని అనుమానం ఉన్న ఈ డ్రగ్స్ వ్యవహారంలో జాతీయ భద్రతా సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి సారథ్యంలోని కమిషన్ ద్వారా విచారణ చేయాలని రణదీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే గుజరాత్‌లో రెండు రోజుల క్రితం భారీ డ్రగ్స్ రాకెట్ పట్టుబడింది. నిఘావర్గాల నుంచి సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న రెండు కంటెయినర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తనిఖీ చేయగా దాదాపు వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పట్టుబడింది. ఈ నెల 15న కంటెయినర్లను స్వాధీనం చేసుకోగా.. ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Telangana: తెలంగాణలో త్వరలోనే బస్సు ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంపు ?

Telangana: కేసీఆర్ కాదు కేటీఆర్.. వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి.. అసలు కారణం ఇదేనా ?

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ కేంద్రంగా పనిచేస్తున్న హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి టాల్కమ్ పౌడర్ మాటున వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్.. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఆషీ ట్రేడింగ్ సంస్థకు వెళ్తున్నట్టు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంస్థ వ్యాపార లావాదేవీలు, ఇప్పటి వరకు ఎన్ని కన్‌సైన్‌మెంట్లు ఏయే దేశాల నుంచి వచ్చాయి అన్న వివరాలను సేకరిస్తున్నారు.

First published:

Tags: Congress, Drugs

ఉత్తమ కథలు