Home /News /national /

CONGRESS PROTESTS ALL INDIA CONG STIR POLICE DETAINED PRIYANKA GANDHI RAHUL GANDHI SK

Congress Protests: బారీకేడ్స్ దూకిన ప్రియాంక గాంధీ.. పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఆందోళనలు

కాంగ్రెస్ ఆందోళనలు

Congtress Protests: ఏఐసీసీ కార్యాలయం నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి ర్యాలీ తలపెట్టారు. ఆ ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అక్బర్ రోడ్డుకు తరలివచ్చారు. ఐతే వారిని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ బారీకేడ్లను అడ్డుగా పెట్టారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. ద్రవ్యోల్పణం, జీఎస్టీ, నిరుద్యోగం, అగ్నిపథ్‌ వంటి అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పాల్గొన్నారు. నల్ల దుస్తులు ధరించి నిరసన చేపట్టారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి ర్యాలీ తలపెట్టారు. ఆ ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అక్బర్ రోడ్డుకు తరలివచ్చారు. ఐతే వారిని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ బారీకేడ్లను అడ్డుగా పెట్టారు. పోలీసుల తీరుపై ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఎందుకు అడ్డుకున్నారని మండిపడ్డారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలో ఆమె బారికేడ్లను దూకారు. ఈ క్రమంలోనే మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు.





    అటు రాహుల్ గాంధీని కూడా పోలీసులు అడ్డగించారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో అక్బర్ రోడ్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ లైన్స్ కింగ్‌స్వాయ్ క్యాంప్‌నకు తరలించారు.





    అటు సోనియా గాంధీ కూడా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. ఆమెతో పాటు పలువురు ఎంపీలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఢిల్లీ మాత్రమే కాదు.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తోంది. రోడ్లపైనే కాదు.. చట్ట సభల్లో కూడా ఇదే రచ్చ. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా లోక్ సభ, రాజసభలోనూ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. అందువల్ల ఉభయ సభలు పదే పదే వాయిదా పడుతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Congress, New Delhi, Priyanka Gandhi, Rahul Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు