కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి తల్లి ఇటలీలో కన్నుమూశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్వీట్ చేశారు. సోనియా గాంధీ(Sonia Gandhi) తల్లి పావోలా మైనో శనివారం 27 ఆగస్టు 2022న ఇటలీలోని తన స్వగృహంలో మరణించారని ఆయన తెలిపారు. ఆమె అంత్యక్రియలు(Last Rites) నిన్న జరిగాయని జైరాం రమేష్ తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గత కొన్నేళ్లుగా తమ అమ్మమ్మను కలవడానికి చాలాసార్లు వెళ్లారు. 2020లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) తరచుగా విదేశీ పర్యటనలు చేయడంపై విమర్శలు వచ్చాయి. అయితే సమీప బంధువు అనారోగ్యంతో ఉండటం వల్లే ఇటలీలో ఆయన పర్యటిస్తున్నారని అప్పట్లో పార్టీ పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కలవడానికి ఆగస్టు 23న బయలుదేరారు. సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పటికే విదేశాల్లో ఉన్నారు. ఇటలీకి చెందిన సోనియాగాంధీని రాజీవ్ గాంధీ ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజీవ్ గాంధీ మరణించిన తరువాత కొన్నాళ్లకు కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న సోనియాగాంధీ.. పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
అయితే వయోభారం, అనారోగ్యం కారణంగా కొంతకాలం నుంచి ఆమె పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఇక ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండంతో.. పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబయేతర వ్యక్తులకు అప్పగించాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో జరిగే పార్టీ ఎన్నికల్లో అలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Railway Ticket Booking: రైల్వే టికెట్ల బుకింగ్ కోసం రష్యా సాఫ్ట్వేర్.. సెకన్లలోనే పని పూర్తి చేసుకుంటున్న బ్రోకర్లు
Russia: గ్యాస్ కట్ చేసిన రష్యా.. యూరోప్ దేశాల్లో మొదలైన టెన్షన్.. ఎందుకంటే..
మరోవైపు సెప్టెంబర్లో భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసేందుకు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టారు. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sonia Gandhi