హోమ్ /వార్తలు /జాతీయం /

ఉపన్యాసాలు సరే... రాఫెల్ గురించి మాట్లాడండి... ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్

ఉపన్యాసాలు సరే... రాఫెల్ గురించి మాట్లాడండి... ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్

రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

రాఫెల్ కుంభకోణంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్ర ఉందని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. మోదీ కాపలాదారుడే కాదు అని... ఆయన దొంగ అని మండిపడ్డారు. రాఫెల్ డీల్ వ్యవహారంలో రక్షణశాఖను పక్కనపెట్టి ప్రధాని నరేంద్రమోదీ, పీఎంవో ఫ్రాన్స్‌తో చర్చలు జరిపిందని ధ్వజమెత్తారు.

ఇంకా చదవండి ...

    పార్లమెంట్‌లో అనేక అంశాలపై మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ... కానీ రాఫెల్ డీల్‌పై మాత్రం ఆయన నోరు మెదపలేని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. రాఫెల్ కుంభకోణంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్ర ఉందని ఆయన మరోసారి ఆరోపించారు. మోదీ కాపలాదారుడే కాదు అని... ఆయన దొంగ అని మండిపడ్డారు. రాఫెల్ డీల్ వ్యవహారంలో రక్షణశాఖను పక్కనపెట్టి ప్రధాని నరేంద్రమోదీ, పీఎంవో ఫ్రాన్స్‌తో చర్చలు జరిపిందని ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి కోసం రూ. 30 వేల కోట్లు దోచిపెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయంలో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ కూడా అబద్ధాలు చెప్పారని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టును కేంద్రం తప్పుదోవ పట్టించిందని రాహుల్ గాంధీ వెల్లడించారు.


    రక్షణశాఖ వ్యతిరేకించినా... ఈ ఒప్పందం ఎందుకు చేసుకున్నారో ప్రధాని నరేంద్రమోదీ దేశానికి చెప్పాలని అన్నారు. రాబర్ట్ వాద్రా, చిదంబరం సహా కాంగ్రెస్ నేతలు ఎవరినైనా విచారించే అధికారం ప్రభుత్వానికి ఉందని... వారంతా విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అదే సమయంలో రాఫెల్ డీల్‌పై కూడా విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని... దీనిపై జేపీసీ వేయాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాను గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కలిసినప్పుడు ఈ విషయాలేవీ మాట్లాడలేదని... కేవలం ఆయన ఆరోగ్యం గురించి మాత్రమే వాకబు చేశానని స్పష్టం చేశారు.

    First published:

    Tags: Narendra modi, Pm modi, Rafale Deal, Rahul Gandhi

    ఉత్తమ కథలు