హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ప్రియాంక గాంధీ మోదీపై పోటీ చేస్తారా ? రాహుల్ గాంధీ ప్లాన్ ఇదేనా ?

ప్రియాంక గాంధీ మోదీపై పోటీ చేస్తారా ? రాహుల్ గాంధీ ప్లాన్ ఇదేనా ?

ప్రియాంక గాంధీ పొలిటికల్ కెరీర్ విషయంలో రాహుల్ గాంధీ పక్కా క్లారిటీతోనే ఉన్నారని కాంగ్రెస్‌లోని కొందరు చర్చించుకుంటున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీ... ఎన్నికల్లో పోటీ చేయడం కూడా దాదాపు ఖాయమే అని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

  ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతలను తీసుకున్న రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ విషయంలో ఆమె సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏ రకమైన ఆలోచనతో ఉన్నారనే అంశం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొద్దిరోజులుగా ప్రియాంక గాంధీ పోటీపై ఆసక్తికరమైన న్యూస్ ప్రచారంలో ఉంది. వారణాసిలె ప్రధాని నరేంద్రమోదీపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ సైతం... ఇది నిజమో కాదో నేరుగా చెప్పలేదు. ఇది నిజమో కాదో మీ ఊహకే వదిలేస్తున్నానంటూ ఆయన వ్యాఖ్యానించారు.

  దీంతో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా ? ఒకవేళ చేస్తే మొదటిసారే ప్రధాని నరేంద్రమోదీపై పోటీ చేసేంత సాహసవంతమైన నిర్ణయం తీసుకుంటారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే ప్రియాంక గాంధీ పొలిటికల్ కెరీర్ విషయంలో రాహుల్ గాంధీ పక్కా క్లారిటీతోనే ఉన్నారని కాంగ్రెస్‌లోని కొందరు చర్చించుకుంటున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీ... ఎన్నికల్లో పోటీ చేయడం కూడా దాదాపు ఖాయమే. దీనిపై ముందుగానే ఒక అంచనాకు వచ్చిన రాహుల్ గాంధీ... ఆమె కోసం అమేథీ సీటును వదులుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

  ప్రస్తుతం యూపీలో అమేథీతో పాటు కేరళలో వయనాడ్‌లో పోటీ చేయబోతున్నారు రాహుల్ గాంధీ. గెలిచిన తరువాత ఈ రెండు సీట్లలో ఏదో ఒకటి ఆయన వదులుకోవాల్సి ఉంటుంది. చాలామంది రాహుల్ గాంధీ వయనాడ్‌ను వదులుకుంటారని భావిస్తున్నా... ఆయన మాత్రం అమేథీని వదులుకుని ఆ సీటును తన చెల్లెలు ప్రియాంక గాంధీకి అప్పగించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అలా చేయడం ద్వారా ఉత్తరాది నుంచి ప్రియాంక గాంధీ, దక్షిణాది నుంచి తాను ప్రాతినిథ్యం వహించినట్టు అవుతుందని రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి చెల్లెలు ప్రియాంక గాంధీ పోటీ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టమైన ఆలోచనతోనే ఉన్నట్టు అర్థమవుతోంది.

  First published:

  Tags: Congress, Narendra modi, Priyanka Gandhi, Rahul Gandhi, Varanasi S24p77, Wayanad S11p04

  ఉత్తమ కథలు