హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే..! ఎంతో ప్రత్యేకం.. పీవీ నరసింహారావు తర్వాత ఆయనే..

Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే..! ఎంతో ప్రత్యేకం.. పీవీ నరసింహారావు తర్వాత ఆయనే..

మల్లిఖార్జున ఖర్గే, పీవీ నరసింహారావు

మల్లిఖార్జున ఖర్గే, పీవీ నరసింహారావు

Congress President Elections: శశిథరూర్, ఖర్గేల్లో ఎవరు గెలిచినా.. ఈ ఎన్నిక మాత్రం చాలా స్పెషల్ అవుతుంది. ఎందుకంటే.. వీరిద్దరు సౌత్‌కి చెందినవారు. శశిథరూర్ కేరళకు చెందిన వారు కాగా.. ఖర్గేది కర్నాటక.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి కొత్త బాస్ ఎవరు..? మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) గెలుస్తారా? లేదంటే శశిథరూర్ (Shashi Tharoor) విజయం సాధిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు (Congress President Elections) నామినేషన్లు నిన్నటితో ముగిశాయి. మొత్తం మూడు నామినేషన్లు వచ్చాయి. రాజ్యసభలో విపక్ష నేత  మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, ఝార్ఖండ్ మాజీ మంత్రి కేన్ త్రిపాఠి నామినేషన్ వేశారు. త్రిపాఠి నామమాత్రంగానే పోటీలో ఉండడంతో.. ప్రధాన పోటీ ఖర్గ, థరూర్ మధ్యే ఉంది. వీరిద్దరూ దక్షిణాది నేతలే కావడం విశేషం. అంటే ఈసారి దక్షిణాదికి చెందిన నాయకుడే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారన్న మాట.

  మల్లిఖార్జున ఖర్గే.. గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి గహ్లోత్‌ను తప్పించాల్సిన పరిస్థితి రావడంతో.. ఆయన స్థానంలో ఖర్గేను తెరపైకి తెచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఎవరికీ ఉండదని.. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని.. రిటర్నింగ్‌ అధికారి మధుసూధన్‌ మిస్త్రీ చెప్పినప్పటికీ.. ఏఐసీసీ కార్యాలయంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపించాయి. సీనియర్ నేతలంతా ఖర్గేకే మద్దతు తెలిపారు. దిగ్విజయ్‌ సింగ్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రులు భూపీందర్‌ సింగ్‌ హూడా, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, అధికార ప్రతినిధి అభిషేక్‌ మనూ సింఘ్వీ, మాజీ కేంద్రమంత్రి అజయ్‌ మాకెన్‌ వంటి కాంగ్రెస్ హేమాహేమీలంతా ఖర్గే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. సీనియర్లంతా ఆయనకే జై కొట్టడంతో పరోక్షంగా హైకమాండ్ మద్దతు ఆయనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ లెక్కన ఆయనే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్నాయి.

  శశిథరూర్, ఖర్గేల్లో ఎవరు గెలిచినా.. ఈ ఎన్నిక మాత్రం చాలా స్పెషల్ అవుతుంది. ఎందుకంటే.. వీరిద్దరు సౌత్‌కి చెందినవారు. శశిథరూర్ కేరళకు చెందిన వారు కాగా.. ఖర్గేది కర్నాటక. కాంగ్రెస్ పార్టీకి చాలాకాలం పాటు గాంధీ కుటుంబ సభ్యులే అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల వారే పార్టీ బాధ్యతను నిర్వర్తిస్తూ వచ్చారు. దక్షిణాది నుంచి తక్కువ మంది నేతలు మాత్రమే కాంగ్రెస్‌కు బాస్‌గా పనిచేశారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది నుంచి మొదట పట్టాభి సీతారామయ్య అధక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య. కె.కామరాజ్‌, నిజలింగప్ప, పీవీ నరసింహారావు అధ్యక్షుడిగా ఉన్నారు. 1994లో చివరగా పీవీ నరసింహారావు దక్షిణాది నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత దక్షిణాది నేతలెవరికీ ఆ పదవి దక్కలేదు. మళ్లీ ఇన్నేళ్లకు అవకాశం వచ్చింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Congress, Congress President Elections, Mallikarjun Kharge, Pv narasimha rao, Sonia Gandhi