హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్.. దిగ్విజయ్ కూడా ఔట్.. కొత్త బాస్ ఆయనేనా?

Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్.. దిగ్విజయ్ కూడా ఔట్.. కొత్త బాస్ ఆయనేనా?

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

Congress President Elections: పార్టీలో మల్లికార్జున ఖర్గేకు అంతకంతకూ పెరుగుతోంది. ఆయనే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలని మెజారిటీ నేతలు కోరుకుంటున్నారు. పీఎల్ పునియా, అశోక్ గహ్లోత్, కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ నేతలు కూడా ఖర్గేకు మద్దతు తెలుపుతున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు (Congress President Elections) రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజు ఇవాళే కావడంతో  గంట గంటకూ పరిణామాలు మారిపోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి రాజస్థాన్ సీఎం  అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) తప్పుకోగా.. ఇప్పుడు మరో నేత కూడా తప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. అశోక్ గహ్లోత్‌ పోటీలో లేకపోవడం.. శశిథరూర్‌ (Shashi Tharoor)కు హైకమాండ్ అండదండలు లేకపోవడంతో.. దిగ్విజయ్ సింగే (Digvijay Singh) కొత్త అధ్యక్షుడవుతారని అంతా అనుకున్నారు. కాని ఇవాళ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ప్రెసిడెంట్ రేస్‌లోకి రావడంతో.. పరిస్థితులు మారిపోయాయి. ఖర్గేకు తాను మద్దతు తెలుపుతున్నానని.. అందుకనే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.

  ''మల్లికార్జున ఖర్గే నా సీనియర్. నిన్న ఆయన ఇంటికి వెళ్లాను. ఒకవేళ మీరు నామినేషన్ వేస్తానంటే తాను తప్పుకుంటానని చెప్పాను. తాను పోటీ చేయడం లేదని ఆయన చెప్పారు. కానీ ఖర్గే ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు మీడియా ద్వారా తెలిసింది. ఆయనపై పోటీచేయాలన్న ఆలోచనే నాకు రాదు. అందుకే ఈ ఎన్నికల్లో ఖర్గేకు మద్దతు తెలుపుతున్నా.'' అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.

  పార్టీలో మల్లికార్జున ఖర్గేకు అంతకంతకూ పెరుగుతోంది. ఆయనే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలని మెజారిటీ నేతలు కోరుకుంటున్నారు. పీఎల్ పునియా, అశోక్ గహ్లోత్, కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ నేతలు కూడా ఖర్గేకు మద్దతు తెలుపుతున్నారు. మరి శశిథరూర్ కూడా ఎన్నికల నుంచి తప్పుకుంటారా? లేదంటే మల్లికార్జున ఖర్గేపై పోటీచేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. నామినేషన్లకు ఇవాళే ఆఖరు రోజు కావడంతో ఎవరెవరు నామినేషన్ వేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

  కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణకు నేడే ఆఖరు రోజు. రేపు నామినేషన్లను పరిశీలించి అర్హులైన వారి జాబితాను ప్రచురిస్తారు. నామినేషన్లను విత్ డ్రాకు వారం రోజుల పాటు సమయం ఉంటుంది. అందుకు అక్టోబరు 8 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. ఆ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ ఉంటే పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబరు 17న పోలింగ్ జరుగుతుంది. అక్టోబరు 19న ఓట్లను లెక్కించి..ఫలితాలను ప్రకటిస్తారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Congress, Congress President Elections, Digvijaya Singh, Mallikarjun Kharge, Rahul Gandhi, Sonia Gandhi

  ఉత్తమ కథలు