Shashi Tharoor: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు(Congress Presidential Elections) జరిగాయి. 22 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబం కాని వ్యక్తి పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. 134 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చాలా పర్యాయాలు అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం ఆరు సార్లు మాత్రమే పోటాపోటీగా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) విజయం సాధించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ (Shashi Tharoor) పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే 2000, 1997లో పార్టీ అత్యున్నత పదవికి జరిగిన ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లను శశి థరూర్ సంపాదించగలిగారు. ఈ ఎన్నికపై కాంగ్రెస్ మాజీ నేత అశ్వని కుమార్ స్పందించారు. సోనియా రాజకీయ చతురత, శశి థరూర్(Shashi Tharoor) భవితవ్యం గురించి ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై కాంగ్రెస్ మాజీ నేత అశ్వనీ కుమార్ వరుస ట్వీట్లు చేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే భారీ విజయం సాధించారని చెప్పారు. ఈ విజయంతో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఇప్పటికీ సోనియా గాంధీ మాటే చెల్లుతుందనేది మరోసారి రుజువైందన్నారు. ఆమె పార్టీలో ఏ పదవిలో ఉన్నా.. ఆమె రాజకీయాల్లో చురుకుగా ఉన్నంత కాలం.. పార్టీలో ఆమెకు గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. పార్టీ వ్యక్తులు ఆమెపై విధేయత చూపుతారని అన్నారు. ఇది గాంధీ కుటుంబానికి వర్తిస్తుందని తెలిపారు.
ఖర్గే అభ్యర్థిత్వానికి గాంధీ కుటుంబం సపోర్ట్ చేసిందనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఆమె తాను నమ్మిన మల్లికార్జున ఖర్గేకి మొదటి ప్రాధాన్యం ఇవ్వడంలో ఆశ్చర్యం లేదని తెలిపారు. ఆయనే ఆమె మొదటి ఎంపికని పేర్కొన్నారు. సుదీర్ఘ సంవత్సరాలుగా రాజకీయ పెత్తనంతో కాంగ్రెస్ పార్టీ కొనసాగిందని ఆరోపించారు. పార్టీలో కుటుంబ ప్రాబల్యాన్ని ప్రదర్శించేందుకు ఎన్నికలను ఉపయోగించుకోవడంలో సోనియా గాంధీ తన చురుకైన రాజకీయ చతురతను మరోసారి ప్రదర్శించారని చెప్పారు.
the alienation of party persons over the years
In this necessary task, he will need the family’s support Defining ideological battles cannot be captive to personal vanities and animosities. 7/7 — Dr Ashwani Kumar (@DrAshwani_Kumar) October 19, 2022
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే 7,897 ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి శశి థరూర్ 1,072 ఓట్ల మాత్రమే దక్కించుకున్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత శశి థరూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం నిజంగా ప్రారంభమైందని చెప్పారు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదని, పార్టీ బలోపేతం కావాలని మాత్రమే కోరుకుంటున్నానని పేర్కొన్నారు. బలమైన భారతదేశం కోసం, బలమైన కాంగ్రెస్ అవసరమని శశి థరూర్ అభిప్రాయపడ్డారు.
ఇక, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన శశి థరూర్‌ను అశ్వని కుమార్ ప్రశంసించారు. 2020లో సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల బృందం గురించి ప్రస్తావించారు. జి-23 గ్రూపులో శశి థరూర్ ఉన్నారని, మిగిలిన వారి కంటే ఆయన ముందుకు వచ్చి స్వరం వినిపించారని పేర్కొన్నారు. శశి థరూర్ సుదీర్ఘకాలం జాతీయ స్థాయి రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఆయన పరిస్థితి ఆయన ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Mallikarjun Kharge, Shashi tharoor