హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Congress: దిగ్విజయ్ వర్సెస్ శశిథరూర్..రసవత్తరంగా అధ్యక్ష ఎన్నికలు..సోనియా మద్దతు ఎవరికి?

Congress: దిగ్విజయ్ వర్సెస్ శశిథరూర్..రసవత్తరంగా అధ్యక్ష ఎన్నికలు..సోనియా మద్దతు ఎవరికి?

దిగ్విజయ్ సింగ్, శశిథరూర్

దిగ్విజయ్ సింగ్, శశిథరూర్

Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణకు సెప్టెంబరు 30 ఆఖరు రోజు. అక్టోబరు 1న నామినేషన్లను పరిశీలించి జాబితాను ప్రచురిస్తారు. నామినేషన్లను విత్ డ్రాకు అక్టోబరు 8 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు (Congress President Elections) రసవత్తరంగా మారాయి. రోజుకో మలుపు తీసుకుంటున్నాయి.  మొన్నటి వరకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)  పేరు ప్రధానంగా వినిపించింది. గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న ఆయనే  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడవుతారని ప్రచారం జరిగింది.  కానీ రాజస్థాన్ రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో అంతా తలకిందులయింది. అశోక్ గహ్లోత్ ఏకంగా రేసు నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడయితే, రాజస్థాన్ సీఎం పదవికి రాజీనామా చేయాలని హైకమాండ్ స్పష్టం చేయడంతో.. అక్కడి రాజకీయాల్లో సంక్షోభం నెలకొంది. ఆయనే సీఎంగా ఉండాలంటూ దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు అదిష్టానానికి ఎదురు తిరిగారు. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం చేసిన సోనియా గాంధీ (Sonia Gandhi).. గహ్లోత్‌పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

  గహ్లోత్ డబుల్ గేమ్ ఆడుతున్నారని భావిస్తున్న హైకమాండ్.. ఆయన స్థానంలో దిగ్విజయ్ సింగ్‌ (Digvijay Singh)ని తెరమీదకు తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఖాయమైంది. ఆయన ఇవాళ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తారు. ఇవాళే నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. CEA ఛైర్మన్ అందుబాటులో లేనందున.. ఇవాళ కాకుండా రేపు నామినేషన్ దాఖలు చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అటు మరో సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీనిపై ఇది వరకే ఆయన క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12:30 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు.

  మాటల్లేవ్..’... రాహుల్ గాంధీని హత్తుకుని ఎమోషనల్ అయిన బాలిక.. వీడియో వైరల్..

  అటు మల్లిఖార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. నిన్న సోనియా గాంధీతో ఏకే ఆంటోని సమావేశమయ్యారు. ఒకవేళ కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ ఇద్దరే ఉంటే.. సోనియా గాంధీ మద్దతు దిగ్విజయ్ సింగ్‌కే ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు దిగ్విజయ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణకు సెప్టెంబరు 30 ఆఖరు రోజు. అక్టోబరు 1న నామినేషన్లను పరిశీలించి జాబితాను ప్రచురిస్తారు. నామినేషన్లను విత్ డ్రాకు అక్టోబరు 8 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అనంతరం తుది జాబితాను ప్రకటిస్తారు. అధ్యక్ష ఎన్నికలకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలైతే.. ఎలాంటి ఎన్నికలు ఉండవు. ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ ఉంటే.. ఎన్నికలను నిర్వహిస్తారు. అక్టోబరు 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహిస్తారు. అక్టోబరు 19న ఓట్లను లెక్కించి..ఫలితాలను ప్రకటిస్తారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Congress, Congress President Elections, Digvijaya Singh, Shashi tharoor

  ఉత్తమ కథలు