మహారాష్ట్రలో మళ్లీ రాజకీయం... నేడు గవర్నర్‌ను కలవనున్న ఎన్సీపీ, శివసేన

Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్‌ను తలపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న శివసేన, ఎన్సీపీ... ఇవాళ గవర్నర్‌ను కలిసి మేటర్ చెప్పబోతున్నట్లు తెలిసింది.

news18-telugu
Updated: November 16, 2019, 6:03 AM IST
మహారాష్ట్రలో మళ్లీ రాజకీయం... నేడు గవర్నర్‌ను కలవనున్న ఎన్సీపీ, శివసేన
మహారాష్ట్రలో మళ్లీ రాజకీయం... నేడు గవర్నర్‌ను కలవనున్న ఎన్సీపీ, శివసేన
  • Share this:
Maharashtra Politics : మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీపై ఫైర్ అయిన శివసేన... రాష్ట్రపతి పాలన అమలయ్యాక... కాంగ్రెస్, ఎన్సీపీతో తాపీగా చర్చలు జరిపింది. ఈ చర్చల ప్రకారం... శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ ఒప్పుకున్నట్లు తెలిసింది. దాంతో... తాము కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామంటున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇవాళ గవర్నర్‌ను కలవబోతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరబోతున్నారు. అన్నీ అనుకున్నట్లే జరిగితే... గవర్నర్ రేపో, ఎల్లుండో ప్రభుత్వ ఏర్పాటుకి పిలిచే అవకాశాలుంటాయి.

ఏం చర్చించారంటే : శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్... శివసేనకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగిస్తున్నాయి. ఐదేళ్ల పాటూ సీఎం పదవితోపాటూ... 16 మంత్రి పదవులు ఆ పార్టీకి దక్కబోతున్నాయి. అలాగే ఎన్సీపీకి 14, కాంగ్రెస్‌కు స్పీకర్ పదవి, 12 మంత్రి పదవులు ఇస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి? కేబినెట్‌లో ఏ పార్టీ మంత్రులు ఎంత మంది ఉంటారు? ఏయే కార్యక్రమాలు అమలు చెయ్యాలి? ఏ పథకాలు తేవాలి ఇలాంటి అంశాలపై మూడు పార్టీలూ చర్చించుకొని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. మొత్తం 40 రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు సమాచారం.

ఇవాళ గవర్నర్‌తో చర్చల తర్వాత... రేపు (ఆదివారం) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవనున్నారు శరద్ పవార్... అన్నీ అనుకున్నట్లే జరిగితే... శివసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మరోవైపు ఎన్నికల ముందు ఒకలా... ఫలితాలు వచ్చాక మరోలా స్టాండ్ మార్చిన శివసేనకు వ్యతిరేకంగా... సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. త్వరలో దీన్ని సుప్రీంకోర్టు విచారించనుంది.

 

Pics : మేఘా ఆకాశ్ క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :నేటి నుంచీ ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు

Health Tips : ఎముకలను దృఢంగా మార్చే టీ... ఎన్నో ప్రయోజనాలు


Health Tips : పీచ్ ఫ్రూట్ తింటున్నారా... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...


Health Tips : రోజూ 4 బాదం పప్పులు తినండి... మీలో వచ్చే మార్పులు ఇవీ...


పార్టీ టైమ్... హ్యాంగోవర్ అదుపులోకి రావాలంటే...

First published: November 16, 2019, 6:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading