news18-telugu
Updated: February 15, 2020, 11:00 AM IST
వాలెంటైన్స్ డే రోజున ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌లతో శశి థరూర్
వాలెంటైన్స్ డే రోజున కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ ఓ ఆసక్తికరమైన ఫోటోను ట్వీట్ చేశారు. విమానంలో ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌తో తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. ఇందులో ఓ ఎయిర్ హోస్టెస్ హార్ట్ సింబల్‌ను చేతిలో పట్టుకుని ఉంది. వాలెంటైన్స్ రోజైన శుక్రవారం సాయంత్రం ఇండిగో విమానంలో బెంగళూరుకు వెళ్తండగా తనకు ఈ అనుభవం ఎదురైనట్లు శశి థరూర్ వెల్లడించారు. ఎయిర్ హోస్టెస్ ఫర్హీన్, సమీక్ష ఇద్దరూ వాలెంటైన్స్ డే సందర్భాన్ని మరవనివ్వలేదని పేర్కొన్నారు. మరో మంచి విమాన ప్రయాణ అనుభవాన్ని మిగిల్చినందుకు థ్యాంక్స్ అంటూ ఇండిగోను అభినందించారు. కాగా శశి థరరూ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా ఇండిగోను శశి థరూర్ అభినందించడం పట్ల సలీల్ త్రిపాఠి అనే రచయిత అభ్యంతరం తెలిపారు. ప్రముఖ జర్నలిస్ట్ అర్బన్ గోస్వామిని రెండున్నర నిమిషాలు మౌనంగా ఉంచినందుకు కామెడియన్ కునాల్ కమ్రా ఇండిగో విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించడాన్ని గుర్తించాలని శశి థరూర్‌కు సూచించారు. దీనిపై స్పందించిన శశి థరూర్..కునాల్ కమ్రాపై ఇండిగో నిషేధం విధించడంపై ఇప్పటికే తాను తప్పుబడుతూ ట్వీట్స్ చేశానని గుర్తుచేశారు. కోర్టును ఆశ్రయించి కునాల్ న్యాయం పొందుతారన్న నమ్మకం ఉందన్నారు. అదే సమయంలో కునాల్ ప్రయాణించిన విమాన పైలట్, తనకు వాలెంటైన్స్ డే విషెస్ చెప్పిన ఇద్దరు ఎయిర్ హెస్టెస్కి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
Published by:
Janardhan V
First published:
February 15, 2020, 10:59 AM IST