కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ (Santokh singh choudhary) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పంజాబ్ లోని ఫిలౌర్ వద్ద యాత్ర చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో ఆయనను అంబులెన్సులో తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో రాహుల్ గాంధీ (Rahul Gandhi) యాత్రను ఆపేసి ఆసుపత్రికి వెళ్లారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
#WATCH | Punjab: Congress MP Santokh Singh Chaudhary was taken to a hospital in an ambulance in Ludhiana, during Bharat Jodo Yatra. Details awaited.
(Earlier visuals) pic.twitter.com/upjFhgGxQk — ANI (@ANI) January 14, 2023
సంతోఖ్ సింగ్ మృతిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ వార్త విని షాకయ్యాను. పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయింది. సంతోఖ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.
Congress national president Mallikarjun Kharge condoles the demises of party MP Santokh Singh Chaudhary.
"Deeply shocked and saddened to learn about the untimely passing away of our MP, Santokh Singh Chaudhary..," he tweets. pic.twitter.com/jZQulVQ12a — ANI (@ANI) January 14, 2023
సంతోఖ్ సింగ్ 1946 జూన్ 198న జలంధర్ లోని దలివాల్ ప్రాంతంలో జన్మించారు. ఈయన పంజాబ్ కాంగ్రెస్ హయాంలో కేబినెట్ మంత్రిగా కూడా పని చేశారు. 2014,2019లో జలంధర్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి రెండు సార్లు గెలుపొందారు. ఎంపీ మృతి పట్ల పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Jodo Yatra, Punjab, Rahul Gandhi