• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CONGRESS MP RAJEEV SATAV DIES OF POST COVID COMPLICATIONS SU

MP Rajeev Satav: కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతవ్ కన్నమూత.. రాహుల్ గాంధీ భావోద్వేగ ట్వీట్..

MP Rajeev Satav: కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతవ్ కన్నమూత.. రాహుల్ గాంధీ భావోద్వేగ ట్వీట్..

రాజీవ్ సతవ్(ఫైల్ ఫొటో)

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతవ్ కన్నుమూశారు. ఆయన మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సంతాపం తెలిపారు.

  • Share this:
    కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతవ్ కన్నుమూశారు. ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న ఆయన.. ఆ తర్వాత తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా మృతిచెందినట్టుగా మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె తెలిపారు. రాజీవ్‌కు ఏప్రిల్ 22న రాజీవ్‌కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. అయితే ఆ మరసటి రోజే పుణెకు చెందిన జహంగీర్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ దాదాపు 20 రోజులు ఆయనకు చికిత్స అందించిన తర్వాత ఆయనకు కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే అప్పటికే ఆయన ఉపిరితిత్తులపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. నాలుగు రోజుల క్రితం ఆయన Cytomegalovirus బారిన పడ్డారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

    రాజీవ్ మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సంతాపం తెలిపారు. ‘నా పార్ల‌మెంట్ మిత్రుడు రాజీవ్ స‌తవ్ మ‌ర‌ణం న‌న్ను క‌ల‌చివేసింది. రాజీవ్ స‌తవ్ స‌మ‌ర్థ‌మైన ప‌నితీరుతో ఎదుగుతున్న నాయ‌కుడు. రాజీవ్ స‌తావ్ కుటుంబానికి, స్నేహితుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా. ఓం శాంతి’అని మోదీ ట్విట్టర్’లో పేర్కొన్నారు.

    ‘నా స్నేహితుడు రాజీవ్ సతవ్ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిలించింది. ఆయన లేని లోటు తీరనిది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’అని రాహుల్ గాంధీ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు.





    రాజీవ్ సతవ్ 1974 సెప్టెంబర్‌ 21న పుణెలో జన్మించారు. కాంగ్రెస్‌ పార్టీలో రాజీవ్‌ సతవ్‌ పలు కీలక పదవులు నిర్వర్తించారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రాజీవ్ 2014-2019 మధ్య హింగోలి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉంటూ గుజరాత్ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 46 ఏళ్ల రాజీవ్.. అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్‌గా కూడా ఉన్నారు. ఇక, రాజీవ్ సతవ్‌ను రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేర్కొంటారు.
    Published by:Sumanth Kanukula
    First published: