గాంధీ ఫ్యామిలీ భద్రతపై... కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్

గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపు అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ లోక్‌సభలో లేవనెత్తారు.

news18-telugu
Updated: November 18, 2019, 8:58 PM IST
గాంధీ ఫ్యామిలీ భద్రతపై... కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్
ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ
  • Share this:
గాంధీ కుటుంబానికి భద్రత కల్పిస్తున్న ఎస్పీజీ ప్రొటక్షన్ తొలగింపు అంశాన్ని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. ఇందుకు సంబంధించి కేంద్రాన్ని ప్రశ్నించింది. ఎస్పీజీ తొలగింపును వాయిదా వేసుకోవాలని సోమవారం లోక్‌సభలో అస్సాం ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ ఈ మేరకు శీతాకాల పార్లమెంట్ సమావేశాల మొదటి రోజునే వాయిదా నోటీసు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబానికి కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను తొలగించి వారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భద్రతా పరమైన లోపం కారణంగానే హత్యకు గురయ్యారని జస్టీస్‌ జేఎస్‌ వర్మ కమిషన్ నివేదికను లోక్‌సభలో వివరించింది.

ఎస్పీజీ అంశంపై కాంగ్రెస్ తమ నిరసనను లోక్‌సభలో నవంబర్ 25 వరకు చేయనున్నట్లు తెలిపింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా గాంధీ కుటుంబానికి ఇస్తున్న సెక్యూరిటీ కవర్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది.

First published: November 18, 2019, 8:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading