పార్లమెంట్ ఉభయ సభలో రచ్చ కొనసాగుతోంది. నిన్నటి వరకు కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేస్తే.. ఇవాళ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీజేపీ సభ్యులు ఆందోళన చేశారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలు తీవ్రం దుమారం రేపాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu)ను.. 'రాష్ట్రపత్ని' అని సంబోధించడాన్ని అధికార పార్టీ ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సభ్యులు నిరసనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
KA Paul: కేఏ పాల్ కు అనుచురుల షాక్.. అప్పు తిరిగి చెల్లించలేదని కార్లు సీజ్
రాష్ట్రపతి పదవిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ పార్టీ ఎంపీ ఆధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) లోక్‌సభలో డిమాండ్ చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళకు జరిగిన అవమానాన్ని సోనియా గాంధీ ఆమోదించారంటూ మండిపడ్డారు. బలహీన వర్గాలకు ఆమె వ్యతిరేకమంటూ దుయ్యబట్టారు. ఇది ఉద్దేశపూర్వంగా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలని.. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని అన్నారు. కరోనా నుంచి కోలుకొని రాజ్యసభకు వచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆదివాసీ సామాజిక వర్గం నుంచి వచ్చి.. రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన అసాధారణ మహిళలను అవమానించారని.. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపత్ని కామెంట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో... తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అధిర్ రంజన్ ఛౌదరి క్షమాపణలు చెప్పారు. పొరపాటున నోరు జారినట్లు అంగీకరించారు. ధరల పెరుగుదల, జీఎస్టీ, అగ్నిపర్పై దేశ ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ విషయాన్ని బీజేపీ పెద్దది చేస్తోందని విమర్శించారు.
— Adhir Chowdhury (@adhirrcinc) July 28, 2022
బీజేపీ నేతలపై సోనియా గాంధీ కూడా స్పందించారు. ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పారని మీడియాకు తెలిపారు.
#WATCH | "He has already apologised," says Congress interim president Sonia Gandhi on party's Adhir Chowdhury's 'Rashtrapatni' remark against President Droupadi Murmu pic.twitter.com/YHeBkIPe9a
— ANI (@ANI) July 28, 2022
రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు.. దేశంలో ద్రవ్యోల్పణం, జీఎస్టీకి వ్యతిరేకంగా విపక్షాలు.. పోటా పోటీ ఆందోళనలు చేయడంతో.. ఉభయ సభలు వరుసగా వాయిదాలు పడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Draupadi Murmu, Lok sabha, Parliament, Rajya Sabha