కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తి దాడి.. వివాహ వేడుకలో తీవ్ర కలకలం

ఎమ్మెల్యేకు సర్జరీ చేశామని.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని డాక్టర్లు చెప్పారు. ఎమ్మెల్యేపై దాడి చేసిన వ్యక్తిని 25 ఏళ్ల ఫర్హాన్ పాషగా గుర్తించారు.

news18-telugu
Updated: November 18, 2019, 4:47 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తి దాడి.. వివాహ వేడుకలో తీవ్ర కలకలం
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి
  • Share this:
కర్నాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్వీర్ సేఠ్‌పై కత్తి దాడి జరిగింది. ఓ వివాహ కార్యక్రమంలో అతడిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఎమ్మెల్యేకు గాయాలు కావడంతో హుటాహుటిన మైసూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేకు సర్జరీ చేశామని.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని డాక్టర్లు చెప్పారు. ఇక ఎమ్మెల్యేపై దాడి చేసిన వ్యక్తిని 25 ఏళ్ల ఫర్హాన్ పాషగా గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 18, 2019, 4:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading