ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్...

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలడం కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: April 14, 2020, 10:44 PM IST
ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్ చేస్తున్న సమయమిది. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం తనకు కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ... ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను కలిశారు. అలా వారిని కలిసిన కొద్ది గంటల్లోనే ఆ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ అని తేలడం... ఆయన ఆస్పత్రిలో చేరడం చకచకా జరిగిపోయాయి. ఈ ఘటన ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో చోటు చేసుకుంది. అహ్మదాబాద్‌లోని జమాల్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదావాలా, గ్యాసుద్దీన్, శైలేష్ పర్మార్ అనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విజయ్ రుపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, హోంమంత్రి ప్రదీప్ సిన్హా జడేజాలను కలిశారు.

అహ్మదాబాద్‌లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రూపానీ వీరితో చర్చించారు. ఈ సమావేశం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జరిగింది. సాయంత్రం 8 గంటలకు ఎమ్మెల్యే ఇమ్రాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేరారు. అయితే అప్పటికే కరోనా లక్షణాలు ఉండి, కరోనా టెస్ట్ కోసం రక్త నమూనాలు ఇచ్చిన ఇమ్రాన్‌ను ముఖ్యమంత్రితో సమావేశానికి అనుమతించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఇమ్రాన్ తన నియోజకవర్గంలో వందలాది మందిని కలిశారని... ఎంతోమంది అధికారులతోనూ చర్చలు జరిపారని తెలుస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: April 14, 2020, 10:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading