HOME »NEWS »NATIONAL »congress mla harsh vijay gehlot threatens madhya pradesh woman officer on camera su

"మహిళవి అయిపోయావు లేకపోతే.." మహిళా అధికారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపులు.. వైరల్‌గా మారిన వీడియో

"మహిళవి అయిపోయావు లేకపోతే.." మహిళా అధికారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపులు.. వైరల్‌గా మారిన వీడియో
(Image-twitter)

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి మహిళ అధికారిపై నోరుపారేసుకున్నాడు. "నువ్వు మహిళా కాకపోయి ఉంటే.. "అంటూ అందరి సమక్షంలోనే బెదిరింపులకు పాల్పడ్డారు.

  • Share this:
    ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి మహిళ అధికారిపై నోరుపారేసుకున్నాడు. "నువ్వు మహిళా కాకపోయి ఉంటే.. "అంటూ అందరి సమక్షంలోనే బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆదివారం మధ్యప్రదేశ్‌లో రత్లాం జిల్లాలోని సైలాన్ పట్ణణంలో ఢిల్లీలో ఆందోళన చేపడుతున్న రైతులకు మద్దతు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలు మూడింటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్ష విజయ్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గెహ్లాట్.. అక్కడున్న జన సముహంతో కలిసి మెమోరాండం సమర్పించడానికి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లారు. అయితే జనం ఎక్కువగా ఉండటంతో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కామిని ఠాకూర్‌ బయటకు రావడానికి సమయం పట్టింది.

    అయితే కామిని ఠాకూర్ బయటకు ఆలస్యంగా రావడంతో గెహ్లాట్ తీవ్ర అసహానానికి లోనయ్యారు. ప్రభుత్వ అధికారి అని చూడకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు. "నువ్వు ఒక మహిళ అధికారివి. ఒకవేళ మీరు పురుష అధికారి అయి ఉంటే.. గల్లా పట్టుకొనేవాడిని.. ఆ తర్వాత మెమో ఇచ్చేవాడిని" అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే ఆ దృశ్యాలు మీడియా ప్రతినిధుల కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎమ్మెల్యే తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.




    ఆడవాళ్లు 15 ఏళ్లకే పిల్లల్ని కనేస్తున్నారు...
    ఇక, కొద్ది రోజుల కిత్రమే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సజ్జన్ సింగ్ వర్మ మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఆడామగల మధ్య పెళ్లి వయసు విషయంలో బేధాలు ఎందుకని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ప్రశ్నను లేవనెత్తారు. మగవారికి మాదిరిగానే ఆడవాళ్లకు కూడా పెళ్లి వయసు 21గా సవరించాలని అన్నారు. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలపై స్పందించిన సజ్జన్ సింగ్ వర్మ.. అమ్మాయిలు 15 ఏళ్ల వయసుకే పిల్లల్ని కంటున్నారని.. అలాంటప్పుడు వారి వివాహ వయసును 18 నుంచి 21కు పెంచడం ఎందుకని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:January 18, 2021, 14:51 IST

    टॉप स्टोरीज