గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే నరేంద్రమోదీ పేరుతో ఉన్న స్టేడియం పేరును మారుస్తామని.. దీనికి సర్ధార్ పటేల్ (Sardar Patel) పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి బీజేపీ (BJP) ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అసల సర్దార్ పటేల్ పేరును ఉచ్చరించే హక్కు కాంగ్రెస్‌కు లేదని ఆయన విమర్శించారు.. గాంధీ-నెహ్రూ కుటుంబం సర్ధార్ పటేల్‌కు పేరు దక్కకుండా చేసేందుకు ఎంతో ప్రయత్నించిందని ఆరోపించారు. ఆయన అంత్యక్రియల నుండి స్మారక చిహ్నం, ఆయనకు భారతరత్న వంటి అంశాల వరకు కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శించార. ఇందుకు సంబంధించిన వాళ్లు ఎన్నో అడ్డంకులు సృష్టించారని.. అలాంటి వాళ్లు ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు.
గుజరాత్ ఎన్నికలకు ముందు న్యూస్ 18 నిర్వహించిన 'గుజరాత్ అధివేషన్'లో పాల్గొన్న అమిత్ షా.. నెట్వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషి ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు. నరేంద్ర మోదీ స్టేడియం అని ఒక స్టేడియం ఉందని.. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అనేక అబద్ధాలు చెబుతోందని అమిత్ షా అన్నారు. వివిధ క్రీడల కోసం 18 స్టేడియాలతో సర్దార్ పటేల్ కాంప్లెక్స్ అని పిలవబడే స్పోర్ట్స్ కాంప్లెక్స్ తయారు చేయబడుతోందని.. వాటిలో ఒక దానికి నరేంద్రమోదీ పేరు పెట్టారని చెప్పారు.
నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత తాము పటేల్ ఫోటో పెట్టడం ప్రారంభించామని అమిత్ షా అన్నారు. ఆయను ఫోటోను కాంగ్రెస్ పాలనలో 50 సంవత్సరాలుగా చూడలేదని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోదీ తయారు చేశారని అమిత్ షా అన్నారు. రైతు నాయకుడు, ఉక్కు మనిషి విగ్రహం కోసం 8.5 కోట్ల మంది కార్మికులు ఉపయోగించిన పనిముట్ల నుండి ఇనుము లభించిందని అన్నారు.
Amit Shah On Gujarat Elections: గుజరాత్లో మళ్లీ అధికారం బీజేపీ .. రికార్డ్ స్థాయిలో సీట్లు గెలుస్తామన్న అమిత్ షా
ఆ ప్రాంతంలో ఒక్క కాంగ్రెస్ నేత కూడా నివాళులర్పించలేదని అన్నారు. మోదీ విగ్రహం చేసినందుకు కాదని.. అది పటేల్ విగ్రహం కాబట్టి అక్కడకు వెళ్లలేదని ఆరోపించారు. ఆయన పేరు మీద ఏ స్కీమ్ లేదని, ఆయనకు భారతరత్న లేదని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎప్పుడూ పటేల్‌కు అన్యాయం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.