ప్రధాని మోదీని పొగిడిన కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత

వలస కార్మికులకు రైళ్లలో ఉచితంగా ప్రయాణం కల్పించకపోయినప్పటికీ... టికెట్ ధరలను మాత్రం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: May 13, 2020, 6:30 PM IST
ప్రధాని మోదీని పొగిడిన కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత
ప్రధాని నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రధాని నరేంద్రమోదీతో పాటు బీజేపీని విమర్శించడంలో ఎప్పుడూ ముందుండే కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి... వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. ఈ అంశంలో ప్రధాని నరేంద్రమోదీ చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు.అయితే రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు పయనమవుతున్న వలస కార్మికులు టికెట్ల భారాన్ని భరించే పరిస్థితుల్లో లేరని ఆయన ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. వలస కార్మికులకు రైళ్లలో ఉచితంగా ప్రయాణం కల్పించకపోయినప్పటికీ... టికెట్ ధరలను మాత్రం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. వలస కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... కాబట్టి ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని అధీర్ రంజన్ చౌధురి తన లేఖలో పేర్కొన్నారు. ఓ వైపు వలస కార్మికుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రం తీరుపై విమర్శలు గుప్పిస్తుంటే... ఆ పార్టీ లోక్‌సభాపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌధురి మాత్రం ప్రధాని తీసుకున్న చర్యలను అభినందించడం విశేషం.
Published by: Kishore Akkaladevi
First published: May 13, 2020, 6:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading