జెండా ఎగరేసి సెల్యూట్ చేస్తూ కాంగ్రెస్ నేత మరణం.. షాక్‌లో కార్యకర్తలు

ప్రతీకాత్మక చిత్రం

Independence Day: ఇది అత్యంత అరుదైన ఘటన. ఇలా ఎప్పుడూ జరగకపోయి ఉండొచ్చు. కానీ ఆ కాంగ్రెస్ నేత విషయంలో జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.

 • Share this:
  దేశమంతా నిన్న 75వ స్వాతంత్ర్య దినోత్సవాల్ని (Independence Day) ఘనంగా జరుపుకోగా... జార్ఖండ్... ధన్‌బాద్‌లో మాత్రం అవి విషాదం అయ్యాయి. అక్కడి కాంగ్రెస్ నేత అన్వర్ హుస్సేన్ (Anwar Hussain)... జెండా ఎగరేశాక తుదిశ్వాస విడిచారు. ఆదివారం జెండా వందన కార్యక్రమానికి హాజరైన ఆయన... అప్పటివరకూ బాగానే ఉన్నారు. అందర్నీ పలకరిస్తూ... శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లు అయిపోయిందంటూ... చరిత్రపై మాట్లాడారు. అంతా బాగానే జరిగింది. అలాంటిది... సరిగ్గా జెండా ఎగరేశారు. దాన్ని చూస్తూ... సెల్యూట్ చేశారు. ఆ తర్వాత అలాగే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అంతే... అక్కడున్న వారంతా... ఏమైంది... ఏమైంది అనుకుంటూ... ఆఘమేఘాలపై ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు.

  అన్వర్ హుస్సేన్... చిర్కుండా బ్లాక్ అధ్యక్షుడు. ఆయన ఎందుకు చనిపోయాడని డాక్టర్లను అడిగితే... ఆయనకు అతిపెద్ద గుండె పోటు (cardiac arrest) వచ్చిందని తెలిపారు. అందువల్లే చనిపోయారని చెప్పారు.

  చాలా మంది గుండె పోటు అంటే... సినిమాల్లో చూపించినట్లు... కాసేపు కంటిన్యూగా ఉంటుంది అనుకుంటారు. కానీ డాక్టర్ల ప్రకారం... గుండెపోటు అనేది వచ్చిన ఒకట్రెండు సెకండ్లకే వ్యక్తి మరణిస్తాడు. అన్వర్ హుస్సేన్ విషయంలో అదే జరిగింది. గుండె కొట్టుకోవడం మానేసింది. ధమనుల నుంచి గుండెకు రక్త సరఫరా ఆగిపోతే... అలాంటి సమయంలో... గుండె కొట్టుకోవడం నెమ్మదించి... ఇబ్బంది పెడుతుంది. అలాంటి సమయంలో మనిషి బతికే అవకాశాలు ఉంటాయి.

  ఇది కూడా చదవండి: Horoscope 16-8-2021: నేటి రాశిఫలాలు.. పనులు పూర్తి.. సమస్యలపై దృష్టి

  ఈ ఘటన తెలియడంతోనే చిర్కుండా బ్లాక్‌లో విషాదం. కార్యకర్తల ఆనందం ఆవిరైపోయింది. ఇలా జరిగిందేంటి అని అంతా ఆశ్చర్యపోయారు.
  Published by:Krishna Kumar N
  First published: