• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CONGRESS LEADERS SHATRUGHAN SINHAS WIFE POONAM SINHA JOINS SAMAJWADI PARTY MAY CONTEST FROM LUCKNOW ON RAJNATH SINGH AK

భర్త ఒక పార్టీ... భార్య మరో పార్టీ... స్టార్ ఫ్యామిలీ రూటే వేరు

భర్త ఒక పార్టీ... భార్య మరో పార్టీ... స్టార్ ఫ్యామిలీ రూటే వేరు

శతృఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా సమాజ్‌వాదీ పార్టీ తరుపున లక్నోలో పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన అదే పాట్నా నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా... శతృఘ్న సిన్హా ప్రత్యర్థి పార్టీలోకి ఆయన భార్య పూనమ్ సిన్హా చేరాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

  • Share this:
    రాజకీయాల్లో అంతా ఒకే పార్టీలో ఉండాలన్న రూల్ ఏమీ లేదు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఉదాహరణలు ఎన్నో. అయితే భార్య, భర్తలు వేర్వేరు పార్టీలో ఉండటం మాత్రం చాలా అరుదు అనే చెప్పాలి. తాజాగా అలాంటి అరుదైన నిర్ణయం తీసుకున్నారు బాలీవుడ్ వెటరన్ హీరో శతృఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పాట్నా నుంచి పోటీ చేసిన శతృఘ్న సిన్హా... కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన అదే పాట్నా నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఆయన ప్రత్యర్థి పార్టీలోకి ఆయన భార్య పూనమ్ సిన్హా చేరాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

    అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ భార్య సమక్షంలో పూనమ్ సిన్హా సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. యూపీ ఎన్నికల తీరును బట్టి చూస్తే... ఎస్పీ, బీఎస్పీలకు కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థి. అలాంటి పార్టీలోకి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న శత్రఘ్న సిన్హా భార్య చేరడం విచిత్రమైన విషయమే. అయితే పూనమ్ సిన్హా బీహార్ నుంచి కాకుండా యూపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఆమెను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో నుంచి పోటీ చేయించేందుకు సమాజ్ వాదీ పార్టీ నిర్ణయించింది. దీంతో భార్యాభర్తలైన శతృఘ్న సిన్హా, పూనమ్ సిన్హా ఇద్దరు రెండు వేర్వేరు రాష్ట్రాల రాజధానుల నుంచి వేర్వేలు పార్టీల తరపున పోటీ చేసిన అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకోనున్నారు. మరి... వేర్వేరు రాష్ట్రాల నుంచి వేర్వేరు పార్టీల తరపున పోటీ చేసేందుకు సిద్ధమైన ఈ స్టార్ కపుల్‌కు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.
    First published: