CONGRESS LEADERS IN PUNJAB UNHAPPY WITH TICKETS ALLOTTING RAHUL GANDHI SILENT ON CM CANDIDATE AK
Punjab: పంజాబ్ కాంగ్రెస్‌లో మొదలైన అసంతృప్తి సెగలు.. సీఎం అభ్యర్థిపై రాహుల్ దాటవేత
సిద్ధూ, రాహుల్, చన్నీ (Image: PTI)
Punjab: అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లో దుమారం రేగింది. ప్రచారంలో ఆ పార్టీ సవాళ్లు ఎదుర్కొంటోంది. తొమ్మిది స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థులపై పార్టీ తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటోంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల రోజుల కంటే తక్కువ సమయం ఉంది. అయితే అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లో దుమారం రేగింది. ప్రచారంలో ఆ పార్టీ సవాళ్లు ఎదుర్కొంటోంది. తొమ్మిది స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థులపై పార్టీ తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటోంది. టిక్కెట్ల కేటాయింపుపై పార్టీలోని ఒక వర్గం నేతలు పార్టీ హైకమాండ్‌ను ప్రశ్నించడమే కాకుండా ‘ఒకే కుటుంబం, ఒకే టిక్కెట్’ నిబంధనను సడలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలు అభ్యర్థుల రెండో జాబితాలో అమర్ సింగ్ (ఎంపీ డాక్టర్ అమర్ సింగ్ కుమారుడు) మోహిత్ మొహింద్రా (సీనియర్ నాయకుడు బ్రహ్మ్ మోహింద్ర కుమారుడు) పేర్లు ఉన్నాయి. ఆరోగ్య కారణాల వల్ల మొహింద్రా పోటీకి నిరాకరించినప్పటికీ.. ఆయన కుమారుడికి టిక్కెట్టు ఇచ్చినట్లు సీనియర్ పంజాబ్ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
ట్రిప్ట్ బజ్వా, రాణా గుర్జీత్ కూడా తమ కుమారుల కోసం టిక్కెట్లు కోరుతున్నారు. టిక్కెట్ నిరాకరించడంతో గుర్జీత్ కుమారుడు ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నారు. సునమ్‌లో యూత్ కాంగ్రెస్ నుండి బలమైన పోటీదారు. పార్టీ టిక్కెట్ నిరాకరించబడిన ధమన్ బజ్వాకు ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మద్దతు ఉంది. అయితే పీసీసీ చీఫ్ తన మేనల్లుడు, సన్నిహితుడు స్మిత్ సింగ్‌కు టికెట్ ఇవ్వాలని కోరారు. దీంతో సునమ్ నుండి సిట్టింగ్ అమర్గఢ్ ఎమ్మెల్యే సూర్జిత్ సింగ్ ధీమాన్ కుమారుడు జస్విందర్ ధిమాన్‌కు టిక్కెట్‌ను నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఖరారు చేశారు.
ఖరార్ నుంచి టికెట్ నిరాకరించడంతో మరో సీనియర్ నేత జగ్మోహన్ సింగ్ కాంగ్ బహిరంగంగానే తిరుగుబాటు చేశారు. పార్టీ అధినేత రాహుల్‌గాంధీ రాష్ట్రంలో ఉన్న రోజున సీఎం చన్నీపై కాంగ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని పునరాలోచించమని కోరతానని అన్నారు. జనవరి 31 వరకు పార్టీకి అల్టిమేటం ఇచ్చానని, ఆ తర్వాత తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటానని కాంగ్ చెప్పారు.
ఇదిలా ఉంటే కెప్టెన్ అమరీందర్ సింగ్ పోటీ చేస్తున్న పాటియాలా (అర్బన్), జలాలాబాద్, నవన్‌షహర్, అత్తారి, బర్నాలా, బదౌర్, ఖేమ్ ఖరన్ మరియు లూథియానా (దక్షిణ) స్థానాలకు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.