• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CONGRESS LEADERS DIGVIJAYA SINGH URGED MP CM KAMALNATH TO RESTORE SECURITY FOR BHOPAL RSS OFFICE AK

ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌కు సెక్యూరిటీ తగ్గింపు... వెంటనే పునరుద్ధరించాలన్న కాంగ్రెస్ నేత

ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌కు సెక్యూరిటీ తగ్గింపు... వెంటనే పునరుద్ధరించాలన్న కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ (ఫైల్)

భోపాల్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గించారనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్... వెంటనే భద్రతను మళ్లీ పునరుద్ధరించాలని ట్విట్టర్ ద్వారా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను కోరారు.

  • Share this:
    బీజేపీకి సపోర్ట్‌గా ఉండే ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ఆఫీస్‌కు సెక్యూరిటీ తగ్గిస్తే... ఫస్ట్ రియాక్షన్ బీజేపీ నాయకుల నుంచే వస్తుందని చాలామంది భావిస్తుంటారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య ఉండే సంబంధాల గురించి తెలిసినవారెవరైనా... ఈ రకంగానే ఆలోచిస్తారు. కానీ... మధ్యప్రదేశ్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా జరగడం విశేషం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గించారనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్... వెంటనే భద్రతను మళ్లీ పునరుద్ధరించాలని ట్విట్టర్ ద్వారా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను కోరారు.

    ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ... ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గిస్తే దిగ్విజయ్ సింగ్‌కు అంత ఉలికిపాటు ఎందుకని విమర్శించింది. మరోసారి 30 ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉంటున్న భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న దిగ్విజయ్ సింగ్... ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గింపు అంశం బీజేపీకి రాజకీయంగా కలిసొస్తుందనే భావనతోనే వెంటనే స్పందించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా... ఆర్ఎస్ఎస్‌ను విమర్శించే కాంగ్రెస్ నేతల్లో ముందు వరుసలో ఉండే దిగ్విజయ్ సింగ్... ఆ సంస్థ ఆఫీసుకు సెక్యూరిటీని పునరుద్ధరించాలని కోరడం నిజంగా విశేషమనే చెప్పాలి.




    First published: