హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

సైన్యం ఆత్మస్థైర్యాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది..దిగ్విజయ్‌పై రవిశంకర్ ఆగ్రహం

సైన్యం ఆత్మస్థైర్యాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది..దిగ్విజయ్‌పై రవిశంకర్ ఆగ్రహం

Video : దేశ ఆర్ధిక పరిస్థితి అద్భుతం.. అందుకు సినిమా కలెక్షన్లే సాక్ష్యం

Video : దేశ ఆర్ధిక పరిస్థితి అద్భుతం.. అందుకు సినిమా కలెక్షన్లే సాక్ష్యం

సాయుధ బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీజేపీ కార్యకర్తలకు రవిశంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు.

  లోక్‌సభ ఎన్నికల వేళ పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ వైమానిక దాడులపై రాజకీయ రగడ రాజుకుంది. పుల్వామా దాడి ఘటనను ప్రమాదంగా అభివర్ణించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సాయుధ బలగాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నేతలు పోటీపడుతున్నారంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను పాకిస్తాన్‌ మీడియాలో చూపిస్తున్నారని..వారి తీరుపై తమకు అనుమానాలున్నాయని ధ్వజమెత్తారు.

  పుల్వామా దాడిపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ట్వీట్లు చూస్తుంటే ఇదో కుట్రలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ వారు మాట్లాడిన మాటలను పాకిస్తాన్‌లో పదేపదే చూపిస్తున్నారు. 45 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి ఘటనను దిగ్విజయ్ సింగ్ ప్రమాదంగా అభివర్ణిస్తారా? ఈ వ్యాఖ్యలు చేసి దిగ్విజయ్ తన స్థాయిని దిగజార్చుకున్నారు. కాంగ్రెస్ నేతల ఆలోచనా విధానం ఇంతే.
  రవిశంకర్ ప్రసాద్,కేంద్రమంత్రి
  అటు బాలాకోట్‌లో వైమానికదాడులపై అనుమానం వ్యక్తంచేసిన కపిల్ సిబల్‌పైనా విరచుకుపడ్డారు. ఆయన అంతర్జాతీయ పత్రికలు చూడడం మానేసి..దేశీయ పత్రికలు చూస్తే మంచిదని ఎద్దేవా చేశారు. సాయుధ బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీజేపీ కార్యకర్తలకు రవిశంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు.

  కాగా, ఫిబ్రవరి 14న పుల్వామాజిల్లా అవంతిపొరా ప్రాంతంలో crpf బలగాలపై ఉగ్రదాడి జరిగింది. జైషే మహ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ కారుబాంబుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఆ మారణహోమంలో 45 మంది జవాన్లు చనిపోయారు. దానికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసింది భారత్. బాలాకోట్‌లోని జైషే మహ్మద్ స్థావరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఎయిర్‌ఫోర్స్ దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bjp, Congress, India VS Pakistan, Pulwama Terror Attack, Surgical Strike 2

  ఉత్తమ కథలు