హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కాంగ్రెస్ నేత పాకిస్థాన్‌లో పర్యటన...ఏకిపారేస్తున్న నెటిజన్స్

కాంగ్రెస్ నేత పాకిస్థాన్‌లో పర్యటన...ఏకిపారేస్తున్న నెటిజన్స్

శతృఘ్న సిన్హా(ఫైల్ ఫోటో)

శతృఘ్న సిన్హా(ఫైల్ ఫోటో)

40 మంది భారత జవాన్లను బలితీసుకున్న పుల్వామా ఉగ్రవాద దాడి ఘటనకు ఏడాది పూర్తయిన వేళ...ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేత, బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా పాకిస్థాన్‌ వెళ్లడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా పాకిస్థాన్‌లో పర్యటించడంపై వివాదంరేగుతోంది. లాహోర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన అక్కడ పర్యటించారు. ఈ వేడుకలో పాక్ రాజకీయ, సినీ ప్రముఖులతో కలిసి ఆయన ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్థాన్‌కు చెందిన పారిశ్రామికవేత్త మొయిన్ అసద్ అసాన్ ఆహ్వానం మేరకు శతృఘ్న సిన్హ లాహోర్‌లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శతృఘ్న సిన్హ లాహోర్‌లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పుల్వామా దాడి ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా అమరులైన జవాన్ల త్యాగాలను గౌరవించడం ఇదేనా అంటూ శతృఘ్నను ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

    Published by:Janardhan V
    First published:

    Tags: Pakistan, Shatrughan Sinha

    ఉత్తమ కథలు